చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో సోదాలపై ఐటీ నివేదిక

శ్రీనివాస్‌ నివాసంలో ఐటీశాఖ అధికారులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే తాజా పంచనామా నివేదికతో ఆ ఆరోపణలు అవాస్తమని ఐటీ నివేదిక ద్వారా వెల్లడైంది.

news18-telugu
Updated: February 16, 2020, 11:12 AM IST
చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో సోదాలపై ఐటీ నివేదిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో గత కొన్ని రోజులుగా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తనిఖీలకు సంబంధించి దాడుల్లో పట్టుబడిన సొమ్ము వివరాలు పేర్కొంటూ ఐటీ అధికారులు పంచనామా నివేదికను విడుదల చేశారు. ఈ సోదాల్లో రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఐటీశాఖ పేర్కొంది. మరోవైపు శ్రీనివాస్ ఇంట్లో రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐటీ పంచనామా నివేదిక తేల్చింది. అంతేకాదు సోదాల అనంతరం పంచానామా నివేదికపై శ్రీనివాస్‌, ఐటీ అధికారుల సంతకాలు చేసినట్లు నివేదికలో ఉంది. శ్రీనివాస్‌ నివాసంలో ఐటీశాఖ అధికారులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే తాజా పంచనామా నివేదికతో ఆ ఆరోపణలు అవాస్తమని ఐటీ నివేదిక ద్వారా వెల్లడైంది.

గత కొన్ని రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారనే వార్తలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పోలీసు బందోబస్తు నడుమ ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. 2019 వరకు సుదీర్ఘకాలం చంద్రబాబు దగ్గర పీఏగా పని చేశారు శ్రీనివాస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత శ్రీనివాస్ మళ్లీ తన మాతృశాఖకు వెళ్లిపోయారు.





First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు