ఓ వైపు రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న తరుణంలోనే ఐటీ దాడులు కూడా మొదలుకావడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు సన్నిహితులైన పలువురి ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. జైపూర్‌లోని ఓ ఫైర్ స్టార్ హోటల్‌పై ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాజస్థాన్‌లో సీఎల్పీ సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి దాదాపు 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరైనట్టు తెలుస్తోంది. మరోవైపు తమకు వందకు పైగా ఎమ్మెల్యేల బలం ఉందని అశోక్ గెహ్లాట్ వర్గం చెప్పుకుంటోంది.
ఇక విప్ ధిక్కరించి మరీ ఈ సమావేశానికి దూరంగా ఉన్న సచిన్ పైలెట్ వర్గంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు సచిన్ పైలెట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం. ఆయనతో చర్చలు జరుపుతున్నామని కాంగ్రెస్ హైకమాండ్ తరపున జైపూర్ వచ్చిన రణ్ దీప్ సుర్జేవాలా తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:July 13, 2020, 12:20 IST