కోడెలది ఆత్మహత్యే.. పోస్టుమార్టం రిపోర్టులో కీలక వివరాలు

కోడెల శివప్రసాద్ మృతేదేహానికి నలుగురు డాక్టర్ల బృందం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించింది. దాదాపు 2 గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు.

news18-telugu
Updated: September 16, 2019, 8:47 PM IST

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్యేనని ఉస్మానియా వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. పోస్టుమార్టం నివేదిక హైదరాబాద్ పోలీసులకు అందించింది. ఆయనది ఆత్మహత్యేనని.. ఉరివేసుకొని చనిపోయినట్లుగా ఆధారాలు లభించాయని నివేదికలో డాక్టర్లు పేర్కొన్నారు. మెడ భాగంలో 8 ఇంచుల మేర తాడు బిగించుకున్న ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నారు. కోడెల చివరగా టిఫిన్, కాఫీ తీసుకున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత కొన్ని శాంపిల్స్‌ని సేకరించి FSLకి పంపించారు.

కోడెల శివప్రసాద్ మృతేదేహానికి నలుగురు డాక్టర్ల బృందం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించింది. దాదాపు 2 గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు. మృతదేహం పాడవకుండా ఉండేందుకు ఎంబామింగ్ చేసి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి కోడెల పార్థివదేహాన్ని నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌కు తీసుకెళ్లారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సందర్శనార్థం మంగళవారం ఉదయం వరకు ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్లోనే ఉంచుతారు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...