హోమ్ /వార్తలు /రాజకీయం /

మిషన్ బిల్డ్ ఏపీ కాదు జగన్ కిల్డ్ ఏపీ... నారా లోకేష్

మిషన్ బిల్డ్ ఏపీ కాదు జగన్ కిల్డ్ ఏపీ... నారా లోకేష్

వ్యవస్థల్ని నాశనం చెయ్యడంలో సీఎం జగన్ ట్రేడ్ మార్క్ ఉందని లోకేశ్ విమర్శించారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే అని నారా లోకేశ్ అన్నారు.

ఏపీలో భూములను విక్రయించాలన్న ప్రభుత్వం ప్రతిపాదనను నారా లోకేష్ తప్పుపట్టారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్డ్ ఏపీ మిషన్ కింద రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను విక్రయించి, వాటి ద్వారా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు బిల్డ్ ఏపీ మిషన్ భూముల వేలానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. గుంటూరు, విశాఖల్లోని పలు భూములను విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేలం ద్వారా భూములను కొనుగోలు చేయవచ్చు. పూర్తి డబ్బులు చెల్లించిన తర్వాతే భూముల మీద కొనుక్కున్న వారికి హక్కులు వస్తాయి. భూముల విక్రయం ప్రతిపాదనను నారా లోకేష్ తప్పుపట్టారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో సీఎం జగన్ మీద విరుచుకుపడ్డారు. ‘తల్లిదండ్రుల గొంతు కోసి చంపిన ఉన్మాది కొడుకు త‌రువాత వారికి పెద్ద గుడి కట్టిస్తానని ప్రకటించాడట. ఉన్మాది కొడుకులాగే రాష్ట్రంలో ఆస్తుల‌న్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి ''మిషన్ బిల్డ్ ఏపీ'' పేరు పెట్టారు వైఎస్ జగన్. ఆ కార్యక్రమం పేరు ''మిషన్ బిల్డ్ ఏపీ'' కాదు ''జగన్ కిల్డ్ ఏపీ''’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nara Lokesh

ఉత్తమ కథలు