సీఎం జగన్ నాలుగు నెలలు ఆగాల్సిందే.. ఆర్డినెన్స్ అసాధ్యం..?

రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తూ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజధానిని మార్చాలని చూస్తున్న సీఎం జగన్‌కు ఇది పెద్ద దెబ్బ. అయితే.. ఆర్డినెన్స్ రూపంలోనైనా తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: January 23, 2020, 10:55 AM IST
సీఎం జగన్ నాలుగు నెలలు ఆగాల్సిందే.. ఆర్డినెన్స్ అసాధ్యం..?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్)
  • Share this:
రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తూ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజధానిని మార్చాలని చూస్తున్న సీఎం జగన్‌కు ఇది పెద్ద దెబ్బ. అయితే.. ఆర్డినెన్స్ రూపంలోనైనా తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే, సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం.. ఒక బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాక దానిపై ఆర్డినెన్స్ తీసుకురావడం అసాధ్యం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదీకాక.. అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని, బిల్లులు సజీవంగా ఉన్నపుడు అది సాధ్యం కాని పని అని, దాన్ని బట్టి ఆర్డినెన్స్ అనే ఆలోచనతో లాభం లేదని వివరిస్తున్నారు. అంటే.. సీఎం జగన్ సెలక్ట్ కమిటీ నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మరోవైపు, బిల్లును సెలక్ట్ కమిటీ ఆపకున్నా ఆలస్యం చేసే అవకాశమూ ఉందని, కమిటీ నిర్ణయం వెంటనే చెప్పాలని అడిగే అధికారం ఎవ్వరికీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సెలక్ట్ కమిటీ నిర్ణయం వచ్చాక బిల్లును మండలి తిప్పి పంపితే.. సభలో మరోసారి ఆమోదించాలి. మళ్లీ మండలికి బిల్లు చేరుతుంది. అప్పుడు కూడా బిల్లును ఆమోదించకుండా మరో నెల పాటు హోల్డ్‌లో పెట్టే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే.. మొత్తంగా బిల్లు ఆమోదానికి సీఎం జగన్ నాలుగు నెలల పాటు వేచి చూడాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 23, 2020, 10:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading