హోమ్ /వార్తలు /National రాజకీయం /

Lakhimpur: రైతులపై కారెక్కించడం దారుణం.. లఖింపూర్​ ఘటనపై కేంద్రంపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు..

Lakhimpur: రైతులపై కారెక్కించడం దారుణం.. లఖింపూర్​ ఘటనపై కేంద్రంపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు..

లఖింపూర్​ ఘటనపై ప్రతిపక్షాలు

లఖింపూర్​ ఘటనపై ప్రతిపక్షాలు

లఖింపూర్ ఖేరీ (Lakhimpur kheri)లో జరిగిన కారు ప్రమాదం ఘటనపై ప్రతి పక్షాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల (farmers)పై కేంద్ర మంత్రి (Union Minister) కొడుకు దారుణంగా కారెక్కించడం దారుణమని మండిపడ్డాయి.

ఇంకా చదవండి ...

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur kheri)లో జరిగిన కారు ప్రమాదం ఘటనపై ప్రతి పక్షాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల (farmers)పై కేంద్ర మంత్రి (Union Minister) కొడుకు దారుణంగా కారెక్కించడం దారుణమని మండిపడ్డాయి. ఈ ఘటనలో ఎనిమిది మంద రైతులు మరణించడం (died)పై విచారణ వ్యక్తం చేశాయి.  ఘటనపై విపక్షాలన్నీ తమ గొంతును వినిపిస్తున్నాయి. బహుజన్​ సమాజ్​వాదీ పార్టీ (BSP) చీఫ్ మాయావతి (maya wati) లఖింపూర్​ ఘటనపై మండిపడుతున్నారు. కావాలనే ఇలా చేశారని ఆమె ఆరోపించారు. ఈ సంఘటన బీజేపీ (BJP) క్రూరమైన, అమానవీయ కోణాన్ని బహిర్గతం చేస్తోందని మాయావతి అన్నారు. రేపు బాధిత కుటుంబాలను కలుసుకొని అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.

ఇది రైతుల రాజ్యం కానీ..  బీజేపీది కాదు: ప్రియాంకా గాంధీ వాద్రా

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi wadra)  ఘటనపై సమాచారం తెలుసుకుని లఖింపూర్ ఖేరికి బయలుదేరారు. అయితే లఖింపూర్​కు వెళ్లిన ప్రియాంకను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితులు బాగాలేవని అక్కడినుంచి పంపించేశారు. దీనిపై ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రైతుల దేశం కానీ, బీజేపీది కాదని మండిపడ్డారు. ఇది అణిచివేయడం కిందకే వస్తుందని కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు.

మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ (samaj wadi party) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు కారెక్కించడం అమానుషమని ఆయన అన్నారు. రైతులు చనిపోయినా స్పందించని సీఎం యోగి రాజీనామా చేయాలని అఖిలేష్ (Akhilesh)​ డిమాండ్ చేశారు. అంతేకాదు రేపు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు.

ఇది అణిచివేసే చర్య: రాష్ట్రీయ లోక్‌దల్‌ చీఫ్ జయంత్ చౌదరి

రాష్ట్రీయ లోక్‌దల్‌ చీఫ్ జయంత్ చౌదరి (Jayanth Cowdery) కూడా లఖింపూర్ ఖేరీ ఘటనను అణచివేసే చర్యగా పరిగణించారు. ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కావాలని కాన్వాయ్ అమర్చారని ఆరోపించారు. ఈ విషయంలో రాజకీయాలు చాలా వేడిగా మారాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు (opposition parties) ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ తెరిచాయి.

అసలు ఏం జరిగింది..

లఖింపూర్ ఖేరీ ఖేరీ జిల్లా టికునియాలో ఆదివారం ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉత్తరప్రదేశ్  ఉప ముఖ్య మంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొనాల్సి ఉంది.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్ మిశ్రా (Ajay Kumar Mishra), ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Mourya) పర్యటనకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. వీరి పర్యటనకు వ్యతిరేకంగా టికోనియా-బన్‌బీర్‌పూర్ రహదారి వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే వారి మీదకు రెండు ఎస్‌యూవీ వాహనాలు (SUV Vehicles) దూసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన రైతులు.. రెండు ఎస్‌యూవీ వాహనాలను తగలపెట్టారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

లఖింపూర్‌ ఘటనలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. ఇందులో నలుగురు రైతులు (four formers) ఉన్నట్లు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ (BJP) తన కార్యకర్తలలో నలుగురు మరణించారని ప్రకటించింది. అయితే ఘటన జరిగిన సమయంలో తన కుమారుడు అమిత్​ మిశ్రా ఆ స్థలంలో లేడని కేంద్రమంత్రి అజయ్​ మిశ్రా ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు అజయ్​ మిశ్రా, అమిత్​ మిశ్రా ప్రకటనలు విడుదల చేశారు.

First published:

Tags: Akhilesh Yadav, Died, Farmers, Mayawati, Priyanka Gandhi, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు