మూక దాడులపై వసుంధర రాజే వితండ వాదన!

మూకదాడులకు జనాభా పెరుగుదల, నిరుద్యోగ సమస్యలే కారణమంటూ.. తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు రాజస్థాన్ సీఎం వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారు.


Updated: July 31, 2018, 12:20 PM IST
మూక దాడులపై వసుంధర రాజే వితండ వాదన!
రాజస్తాన్ సీఎం వసుంధర రాజే..(photo:facebook)
  • Share this:
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గోరక్షక దాడులు పెరిగిపోయాన్న విమర్శ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఢిల్లీకి సమీపంలోని అఖ్లాక్ అనే వ్యక్తిపై జరిగిన మూక దాడి దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపింది.ఆ తర్వాత దేశంలోని ఏదో మూల వరుసగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోన్న అంశం.ఇటీవల రాజస్తాన్‌లో రక్బర్ ఖాన్ అనే వ్యక్తిపై గోరక్షకుల పేరుతో ఓ మూక దాడి చేయడం మరోసారి ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తాజాగా ఇదే విషయంపై రాజస్తాన్ సీఎం వసుంధర రాజే 'న్యూస్18'తో మాట్లాడారు. ప్రజల్లో ఫ్రస్టేషన్ రోజురోజుకు ఎక్కువైపోతోందని..ఉద్యోగాలు దొరక్కపోవడం వల్ల అది మరింత ఎక్కువై ఇటువంటి ఘటనలకు దారితీస్తోందంటూ ఆమె వితండ వాదన వినిపించారు.ఈ పరిస్థితి ఒక్క రాజస్తాన్‌లోనే లేదని,ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకొచ్చారు.,

'ఇది ఒక్క రాజస్తాన్‌కు మాత్రమే పరిమితమైన అంశం కాదు.ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి.కొంతమంది అడగవచ్చు..ఇంత జరుగుతున్నా వసుంధర రాజే ఎందుకు ఏమి చేయట్లేదని?.అయితే కొన్నిసార్లు అది క్లిష్టతరం.ఎందుకంటే..రాత్రి 12గం. వేళ రాజస్తాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఏం జరుగుతుందో తెలియాలంటే నేను దేవుడి కన్నా ఎక్కువై ఉండాలి
వసుంధర రాజే, రాజస్తాన్ ముఖ్యమంత్రి


దేశంలో జనాభా పెరిగిపోతుండటం కూడా ఇటువంటి మూక దాడులకు కారణమంటూ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు వసుంధర రాజే.యువతకు ఉద్యోగాలు కావాలని,ఉద్యోగాలు పొందకపోతే వారు ఫ్రస్టేట్ అవుతున్నారని మూక దాడులపై తనదైన సూత్రీకరణ చేశారు.దేశంలోని ప్రజలందరిలో,అన్ని కమ్యూనిటీల్లో ఇలాంటి ఫ్రస్టేషన్ పెరిగిపోతోందన్నారు.ఇది ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటన కాదని, చుట్టూ ఉన్న పరిస్థితులపై ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం అని ఆమె చెప్పుకొచ్చారు.వసుంధర రాజే కామెంట్స్ ఇలా ఉంటే..రాష్ట్ర బీజేపీకే చెందిన మరో ఎంపీ హరీశ్ మీనా మాత్రం ఆమెతో విబేధించారు.ఇలాంటి ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం లేదన్నారు.ఇలాంటి ఘటనలపై సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.
First published: July 31, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>