వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ అనగానే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన రాజకీయ పార్టీగానే అందరికీ తెలుసు. మరి, ఆ పార్టీ తనదేనని తెలంగాణ నేత శివకుమార్ ఎందుకంటున్నారో తెలుసుకోవాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లాల్సిందే. 2010లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రి వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ పేరు మీద తెలంగాణకు చెందిన శివకుమార్ అప్పటికే పార్టీని రిజిస్ట్రర్ చేసుకున్నారు. అదే వైఎస్ఆర్‌సీపీ (Y- yuvajana S- sramika R- rythu C- congress P- party). ఈ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి శివకుమార్‌తో చర్చలు జరిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో శివకుమార్ ఆ పార్టీని జగన్‌కు దారాదత్తం చేశారు. ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ.. జగన్‌ను అధ్యక్షుడిని చేశారు. అందుకు ప్రతిగా శివకుమార్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శిగా హోదా కల్పించారు జగన్. అప్పట్నుంచి మొన్నటి తెలంగాణ ఎన్నికల వరకు అంతా సాఫీగానే సాగింది. అయితే, మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కేంద్ర నాయకత్వం తటస్థంగా (అంతర్గతంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారనే ప్రచారం జరిగింది) ఉండాలని నిర్ణయించింది. కానీ, దీనికి వ్యతిరేకంగా శివకుమార్ వైఎస్ఆర్‌సీ శ్రేణులు తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపి, టీఆర్ఎస్‌ను ఓడించాలని పిలుపునిస్తూ పార్టీ ప్రధానకార్యదర్శి హోదాలో ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
దీన్ని సీరియస్‌గా పరిగణించిన గతేడాది డిసెంబర్ 4న వైఎస్ఆర్‌సీపీ అధిష్టానం.. శివకుమార్‌ను పార్టీని సస్పెండ్ చేస్తూ మరో ప్రెస్‌నోట్ విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచే బహిష్కరణ వేటు వేసింది.
ఈ నేపథ్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడిగా వైఎస్ఆర్‌సీపీపై తనకే పూర్తి హక్కులు ఉన్నాయంటూ.. శివకుమార్ కేంద్ర ఎన్నికల కమిషన్ తలుపుతట్టారు. తాను స్థాపించిన పార్టీలో తనకే అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా, ఎవరి సంతకమూ లేకుండా తనను బహిష్కరిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారని చెప్పారు. తనకు న్యాయం చేయాలని ఈసీకి విన్నవించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Telangana Election 2018, Ys jagan, YSR, Ysrcp