జగన్‌కు కొత్త తలనొప్పి.. 3 రోజులు టైమ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..

తన వ్యాఖ్యల ద్వారా ఆనం రామనారాయణరెడ్డి పరోక్షంగా అధినాయకత్వం తీరును తప్పుబడుతున్నారేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: June 4, 2020, 6:20 PM IST
జగన్‌కు కొత్త తలనొప్పి.. 3 రోజులు టైమ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan)
  • Share this:
రాజకీయ పార్టీల్లో అసంతృప్తులు చెలరేగడం సహజం. ఏపీలోని అధికార వైసీపీలోనూ ఇదే రకమైన అసంతృప్తి గళం మొదలైంది. మాజీమంత్రి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి... అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. అయితే అధికారులపై వ్యాఖ్యలు చేస్తూనే ఆయన పరోక్షంగా ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేశారనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని... ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని చూడలేదని ఆనం అనడం చర్చనీయాంశంగా మారింది.

సోమశిల స్వర్ణముఖి కెనాల్ పరిశీలించాలని సీఎం చెప్పినా పట్టించుకోలేదని... తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆనం మండిపడ్డారు. మరో మూడు రోజుల్లో పూర్తి సమాచారంతో మీడియా సమావేశం పెడతానని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యాఖ్యల ద్వారా ఆనం రామనారాయణరెడ్డి పరోక్షంగా అధినాయకత్వం తీరును తప్పుబడుతున్నారేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Anam ramanarayana reddy, cm ys jagan mohan reddy, anam comments on cm ys jagan, Nellore politics, ap latest news, ఆనం రామనారాయణరెడ్డి, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌పై ఆనం వ్యాఖ్యలు, నెల్లూరు రాజకీయాలు, ఏపీ తాజా వార్తలు
ఆనం రామనారాయణరెడ్డి (File)


వరుసగా రెండు రోజుల పాటు ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని కొందరు భావిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన తనను పార్టీ పట్టించుకోవడం లేదనే భావనతోనే ఆయన ఈరకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మూడు రోజుల్లో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ఆనం ప్రకటించడంతో... ఈలోపు వైసీపీ అధినాయకత్వం ఆనంతో చర్చలు జరిపి ఆయన అసంతృప్తిని చల్లార్చేలా చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: June 4, 2020, 6:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading