కన్నా లక్ష్మీనారాయణ కేంద్రంగా వైసీపీ భారీ వ్యూహం?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తప్పించేందుకు ఏపీలోని అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: March 27, 2020, 10:00 PM IST
కన్నా లక్ష్మీనారాయణ కేంద్రంగా వైసీపీ భారీ వ్యూహం?
కన్నా లక్ష్మీనారాయణ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తప్పించేందుకు ఏపీలోని అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సంబంధాలు కలిగిన తమ నాయకులకు ఈ మేరకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రధాన నిర్ణయాలకు కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించిన తర్వాత తొలుత స్పందించింది కన్నా లక్ష్మీనారాయణే. బీజేపీ అభివృద్ది వికేంద్రీకరణకు మద్దతిస్తుందని, పరిపాలన వికేంద్రీకరణకు వ్యతిరేకమని కుండబద్దలు కొట్టారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ పలుమార్లు లేఖలు రాశారు.

తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా సందర్భంగా మరోసారి కన్నా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ నిర్ణయం వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ ఆరోపిస్తే, చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ వత్తాసు పలికారని, అందుకే ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయని వైసీపీలో నెంబర్ 2గా చెలామణి అవుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారి వల్ల రాష్ట్రంలో బీజేపీ నాశనం అయిపోతుందని వైసీపీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఏపీలో కన్నా లక్ష్మీనారాయణను మార్చి, ఆయన స్థానంలో కొత్త వారిని తీసుకొస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా, తెలంగాణ, తమిళనాడుకు కొత్తగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులను ప్రకటించారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు కన్నాకు ఎలాంటి స్థాన చలనం ఉండకపోవచ్చని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 27, 2020, 10:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading