జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి... విజయమ్మ రికమండేషన్ ?

Ys Jagan cabinet ministers | తూర్పుగోదావరి జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో చోటు కోసం మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, దాడిశెట్టి రాజా, కన్నబాబు, విశ్వరూప్ పోటీ పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో జక్కంపూడి రాజా పేరు కూడా చేరడంతో... జగన్ వీరిలో ఎవరికి మంత్రి పదవి ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: June 1, 2019, 12:10 PM IST
జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి... విజయమ్మ రికమండేషన్ ?
ఎన్నికల ప్రచారంలో వైఎస్ విజయమ్మ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో అందరి దృష్టి ఆయన కేబినెట్ ఎలా ఉండబోతోందనే అంశంపైనే ఉంది. జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకోబోయే నేతలు ఎవరనే దానిపై రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియర్లతో పాటు కొత్తవారికి కూడా జగన్ తన కేబినెట్‌లో అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ కొత్తవాళ్లు ఎవరై ఉంటారనే దానిపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. అయితే ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకోబోయే వారి జాబితాలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఉంటారని తెలుస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో దాదాపు ముగ్గురికి అవకాశం దక్కొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో జక్కంపూడి రాజా పేరు కూడా తెరమీదకు వచ్చింది. జక్కంపూడి రాజా వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితుడైన దివంగత నాయకుడు, మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు కావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. జగన్‌తో పాటు విజయమ్మకు కూడా జక్కంపూడి ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఉంది. ఈ కారణంగానే ఆమె జక్కంపూడి రాజాను కేబినెట్‌లో తీసుకోవాలని జగన్‌కు సూచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

తూర్పుగోదావరి జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో చోటు కోసం మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, దాడిశెట్టి రాజా, కన్నబాబు, విశ్వరూప్ పోటీ పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో జక్కంపూడి రాజా పేరు కూడా చేరడంతో... జగన్ వీరిలో ఎవరికి మంత్రి పదవి ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే జక్కంపూడి రాజాకు కేబినెట్ పదవి ఇవ్వలేకపోతే... అందుకు సరిసమానమైన పదవిని ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి జక్కంపూడి రాజాకు మంత్రి పదవి దక్కితే మాత్రం... అందుకు జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఓ కారణమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
First published: June 1, 2019, 12:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading