Home /News /politics /

IS YS JAGAN MOHAN REDDY SEND SOME MESSAGE TO SISTER YS SHARMILA WITH YSRCP KEY LEADER YV SUBBA REDDY AK

YS Jagan-Sharmila: షర్మిలకు వైఎస్ జగన్ మెసేజ్ పంపించారా ? వైసీపీ కీలక నేత ఎందుకు వచ్చినట్టు ?

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: వైవీ సుబ్బారెడ్డి షర్మిలకు వరసకు చిన్నాన్న కూడా కావడంతో.. ఆయన కేవలం ఆమె యోగక్షేమాలు గురించి తెలుసుకోవడానికి వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇంతకాలం షర్మిలను కలవని వైవీ సుబ్బారెడ్డి.. ఉన్నట్టుండి ఆమెను కలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇంకా చదవండి ...
    రాజకీయాల్లో జరిగే కొన్ని పరిణామాల వెనుక అనేక కారణాలు ఉంటాయి. పైకి వాటికి పెద్దగా ప్రాధాన్యత లేదని అనిపించినా.. అంతర్గతంగా మాత్రం వాటి గురించి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంటుంది. తెలంగాణలో ఐదు రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వైసీపీ ముఖ్యనేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) కలవడంపై కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయంగా సీఎం వైఎస్ జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య దూరం బాగా పెరిగింది. ఈ విషయాన్ని షర్మిల (YS Sharmila)  మాటలను బట్టి అర్థమవుతోంది. వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) విషయంలో ఆమె అంత సానుకూలంగా లేరని ఆమె చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఇక ఏపీలోని అధికార వైసీపీ సైతం తెలంగాణలో షర్మిల పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. అసలు ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం వైఎస్ జగన్‌కు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చింది.

    షర్మిల రాజకీయ పార్టీ విషయంలో వైసీపీ తీరు కూడా అలాగే ఉంది. ఇక వైసీపీ, సీఎం జగన్ పట్ల షర్మిల అనుసరిస్తున్న తీరు కూడా ఆమె ఏపీ ముఖ్యమంత్రి పట్ల సానుకూలంగా లేరనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని షర్మిల నిర్ణయించినప్పటి నుంచి వైసీపీ నేతలు, ఆ పార్టీ ముఖ్యనేతలు షర్మిలకు దూరం పాటిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి వైసీపీ ముఖ్యనేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర చేస్తున్న షర్మిలను కలిశారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు.

    వైవీ సుబ్బారెడ్డి షర్మిలకు వరసకు చిన్నాన్న కూడా కావడంతో.. ఆయన కేవలం ఆమె యోగక్షేమాలు గురించి తెలుసుకోవడానికి వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇంతకాలం షర్మిలను కలవని వైవీ సుబ్బారెడ్డి.. ఉన్నట్టుండి ఆమెను కలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వైఎస్ జగన్ వైవీ సుబ్బారెడ్డి ద్వారా షర్మిలకు ఏదో ముఖ్యమైన సందేశాన్ని పంపించి ఉంటారని.. అందుకోసమే వైవీ సుబ్బారెడ్డిని ఆమె దగ్గరకు పంపించారనే టాక్ వినిపిస్తోంది.

    Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

    After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

    అయితే వైవీ సుబ్బారెడ్డి షర్మిలతో ఏం చర్చించారనే విషయం జగన్, షర్మిల, సుబ్బారెడ్డిలకు మాత్రమే తెలిసి ఉంటుందని.. వీరిలో ఎవరో ఒకరు బయటకు చెబితే తప్ప దీని గురించి బయటివాళ్లకు తెలిసే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి వైవీ సుబ్బారెడ్డి ద్వారా జగన్, తన చెల్లెలికి ఏం మెసేజ్ పంపించారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, YS Sharmila, YV Subba Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు