Home /News /politics /

IS TRS CONFIRMS CHOPPADANDI TICKET FOR SUNKE RAVISHANKAR

చొప్పదండిలో శోభకు హ్యాండ్ ఇచ్చినట్టే?.. టికెట్ ఆయనకే?

బొడిగె శోభ, రవిశంకర్ ఫైల్ ఫోటో(Image:Facebook)

బొడిగె శోభ, రవిశంకర్ ఫైల్ ఫోటో(Image:Facebook)

టీఆర్ఎస్ పెండింగ్‌లో పెట్టిన చొప్పదండి టికెట్ ఎవరికి కేటాయించాలన్న దానిపై టీఆర్ఎస్ అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బొడిగె శోభను పక్కనపెట్టి రాష్ట్ర

    టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించని నియోజకవర్గాల్లో టికెట్లు ఎవరికి దక్కుతాయా? అన్నదానిపై హాట్ హాట్ చర్చనడుస్తోంది. టికెట్లు దక్కించుకోవడానికి నేతలు కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చొప్పదండి సిట్టింగ్ అయి ఉండి టికెట్ దక్కించుకోలేని బొడిగె శోభ కేటీఆర్‌ను కలిసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ..ఇప్పటికైతే ఆయన ఆమెతో టచ్‌లోకి రాలేదని తెలుస్తోంది.

    అంతేకాదు, శోభ స్థానంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌‌కు దాదాపుగా టికెట్ ఖాయమైపోయిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. శుక్రవారం రోజే ఆయన పేరు ప్రకటిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. చొప్పదండి టికెట్ కోసం రవిశంకర్‌తో పాటు.. మరో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, టీఎన్జీవోల నాయకుడు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బైరం పద్మయ్య కూడా పార్టీ అధిష్టానానికి దరఖాస్తులు పంపినట్టు తెలుస్తోంది.

    అయితే టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం రవిశంకర్‌కే టికెట్ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. కేసీఆర్ తనకు న్యాయం చేస్తారని శోభ చెబుతున్నప్పటికీ.. ఇక ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవంటున్నారు. దీంతో పార్టీలోనే ఆమె కొనసాగుతారా? లేక టికెట్ కోసం మరో పార్టీలో చేరుతారా? అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Telangana, Telangana Election 2018, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు