GHMC Elections: ఎన్నికల ప్రచారంలో కానరాని హైదరాబాద్ నిర్మాత చంద్ర‌బాబు.. ఇదే కార‌ణ‌మా?

హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు ఊసే లేకుండా పోవ‌డం ఇటు నేత‌ల్లోనూ అటు కేడ‌ర్ లోను నిస్స‌హాయత‌ను పెంచుతుంది అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. సందర్భం వచ్చినప్పుడల్లా.. ‘నేనే హైదరాబాద్’ నిర్మించానని చెప్పుకునే బాబు.. కీలక ఎన్నికల్లో ఎందుకు కనిపించడం లేదు..?

news18
Updated: November 26, 2020, 5:40 PM IST
GHMC Elections: ఎన్నికల ప్రచారంలో కానరాని హైదరాబాద్ నిర్మాత చంద్ర‌బాబు.. ఇదే కార‌ణ‌మా?
చంద్రబాబు.. లోకేశ్ (ఫైల్)
  • News18
  • Last Updated: November 26, 2020, 5:40 PM IST
  • Share this:
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరు తారాస్థాయికి చేరుకున్న నేప‌థ్యంలో అన్ని పార్టీల‌కు సంబంధించిన కీల‌క నేత‌లు... న‌గ‌రవ్యాప్తంగా విసృత్త ప్ర‌చారం చేస్తోన్నారు. ప్ర‌త్యర్ధి పార్టీల తీరును ఎండ‌గ‌డుతున్నారు. అయితే ఈ త‌రుణంలో టీడీపీ మాత్రం ఒక విచిత్ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నది. త‌మ అధినేత‌ల ప‌రిస్థితి చూసి కేడ‌ర్ కూడా ఒక విధ‌మైన నిస్స‌హాయ స్థితికి వెళ్లిపోతున్నాయి. ఎన్నిక‌లు ఏమైనా కావ‌చ్చు కాని చంద్ర‌బాబు నాయుడు అవ‌లంబించే వ్యూహాలు ప్ర‌త్యర్ధ‌ుల‌ను కూడా ఒక‌నొక ద‌శ‌లో బెంబేలెత్తిస్తాయి. త‌న ప్ర‌తీ స‌భ‌లో ‘హైద‌రాబాద్ ను నేనే నిర్మించాను’ అని చెప్పుకునే బాబు ఇప్పుడు సంద‌ర్భం వ‌చ్చినా ఆ విష‌యాన్ని ప్ర‌చారం చేసుకోలేని స్థితిలోకి వెళ్లీ పోయారట.

హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు ఊసే లేకుండా పోవ‌డం ఇటు నేత‌ల్లోనూ అటు కేడ‌ర్ లోను నిస్స‌హాయత‌ను పెంచుతుంది అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. అధినేత పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా పార్టీ ఈ ఎన్నికల్లో ఏకంగా వందకుపైగా సీట్లలో బరిలో నిలిచింది. కానీ ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ గానీ ప్రచారానికి ముందుకు రాలేని ప‌రిస్థ‌తి నెల‌కొందనే వాదనలు వినిపిస్తున్నాయి. దానికి బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంద‌నే అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇక్క‌డ పార్టీ త‌రఫున ప్ర‌చారం చేశారు. అయితే ఈ ప్ర‌చారం పార్టీకి లాభం చేకూర్చ‌డం మాట ప‌క్క‌న పెడితే తీవ్ర‌స్థాయిలో న‌ష్టాన్నే చేకూర్చింది. చంద్ర‌బాబు ప్ర‌చారాన్నే ప్ర‌ధాన ఎజెండా చేసుకొని టీఆర్ఎస్.. బాబు పార్టీని బ‌లంగా దెబ్బ‌కొట్టింది. ఇప్పుడు కూడా చంద్ర‌బాబు కాని లోకేష్ కాని ప్ర‌చారానికి వ‌స్తే ఇలాంటి ప‌రిస్థితే నెల‌కుంటే పార్టీకి వ‌చ్చే ఒక‌టీ అరా సీట్లు కూడా రావ‌నే భ‌యాన్ని పార్టీ నేత‌లు వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఓటు కు నోటు వ్య‌వ‌హారం కూడా బాబు ఈ ప్ర‌చారంలో పాల్గొన‌పోవ‌డానికి మ‌రో ప్ర‌ధాన కార‌ణ‌మ‌నే వాదన‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు అస‌లు అధినేత‌లు ప్ర‌చారానికి వ‌చ్చి అభ్య‌ర్ధుల‌ను గెలుపునకు కృషి చేయ‌క‌పోతే అస‌లు ఎందుకు బ‌రిలో నిలిపిన‌ట్లు అనే వాద‌న‌లు కూడా వినిపిస్తోన్నాయి. ప్ర‌పంచ వేదిక‌ల‌పై హైద‌రాబాద్ ను తానే క‌ట్టాను అనే స్థాయిలో చెప్పుకునే బాబు ఇప్పుడు కీల‌క స‌మ‌యంలో త‌మ‌పార్టీ నుంచి బ‌రిలో నిలిచిన అభ్యర్ధ‌ుల‌కు బాస‌ట‌గా నిల‌వక‌పోవ‌డాన్నిసొంత‌పార్టీ నేత‌లే త‌ప్పుప‌డుతున్నారు. దీంతోపాటు ప్ర‌చారానికి రాకుండా 100 మంది అభ్య‌ర్ధ‌ుల‌ను నిల‌ప‌డం వెనుక ఏదో రాజ‌కీయ పార్టీకి లాభం చేకూర్చ‌డానికే అనే వాదన‌లు కూడా వినిపిస్తోన్నాయి. మొత్తానికి హైదరాబాద్ బ్రాండ్ అంబాసీడ‌ర్ అని చెప్పుకునే బాబు ఇప్పుడు ఆ అంశాన్ని బ‌హిరంగ ప్ర‌చారంలో వాడుకోక‌పోవ‌డం కాస్త ఆస‌క్తిని రేపుతుందంటున్నారు రాజ‌కీయ‌వ‌ర్గాలు.
Published by: Srinivas Munigala
First published: November 26, 2020, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading