జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై కొట్టడానికి అసలు కారణం ఇదా?

జేడీ లక్ష్మీనారాయణ,పవన్ కల్యాణ్

పార్టీలో ఒక్కరే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని లక్ష్మీనారాయణ అన్నారు. అందరూ చర్చించాకే ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు.

 • Share this:
  ఎన్నికల ముందు జనసేన పార్టీలో తాను చేరడానికి గల కారణాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. 'జనసేన పార్టీలోకి ముఖ్యంగా నేను రావడానికి కారణం ఏంటంటే. జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌. జీరో బడ్జెట్ పాలిటిక్స్‌ చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఓటు కొనబోమని చెప్పారు. నేను ఆలోచిస్తోన్న విధి విధానాలు ఉన్నాయి. మీరొస్తే బాగుంటుందని పవన్‌ కల్యాణే నన్ను జనసేనలోకి ఆహ్వానించారు. పార్లమెంటరీ నియోజక వర్గంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సింబల్‌ వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం పడుతుంది. 16, 17 రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నాను. రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు 2,80,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఓడిపోయామని మేము ఎన్నడూ అనుకోలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా గెలుస్తామని భావించాం' అని తెలిపారు.

  AP Assembly Election Results 2019, Lok Sabha Election Result 2019 live, live Lok Sabha Election Result 2019, Lok Sabha Election Result 2019 Live Updates, Lok Sabha Election Result 2019 Live Updates, Lok Sabha Election Result, list of winners of bjp,congress,sp,bsp,jdu,rjd,tmc, bjd,aiadmk,dmk, Lok sabha election result,lok sabha chunav parinam 2019, Lok Sabha election results,loksabha chunav parinam 2019. counting day, votes counting, ap assembly election, ap assembly elections, ap assembly election 2019, ap assembly elections 2019,lok sabha elections, lok sabha election 2019, lok sabha elections 2019, chandrababu, tdp, ys jagan, ycp, pawankalyan, janasena, poll results, survey, Election Result 2019 live, Lok Sabha Election Result Today, Election Result 2019 live, Election Result 2019 Live Updates, Election Result 2019 Live Updates, Election Results 2019, election result, election result 2019, Winner, chunav parinam 2019, Lok Sabha election results, Election Result 2019 LIVE, Vidhan Sabha Chunav Parinam Today, election result, election result 2019, MLA Winner, Vidhan Sabha election results, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, ఎన్నికల ఫలితాలు, సర్వే, ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్, కౌంటింగ్, ఓట్ల లెక్కింపు, ఎగ్జిట్ పోల్స్ చరిత్ర, ఏపీలో టీడీపీ, ఏపీలో వైసీపీ, ఆంధ్రప్రదేశ్, అసెంబ్లీ సీటు, కౌంటింగ్ రిజల్ట్స్, రిజల్ట్, లైవ్ రిజల్ట్, కౌంటింగ్ రిజల్ట్స్,
  లక్ష్మీ నారాయణ, పవన్ కళ్యాణ్


  'పొలీట్ బ్యూరోలో నన్ను ఉండాలన్నారు. ఐదుగురితో పొలిట్ బ్యూరో ఉండడం సరికాదని, ఆ సంఖ్య ఎక్కువ ఉండాలని చెప్పాను. ఆలోచనలు అనేవి అందులో జరగాలని అన్నాను. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుటుందన్నాను. మనం మజ్జిగ చిలికినట్లు నిర్ణయాలను చిలకాలి. ఎక్కువ మంది మదనం చేస్తే మంచి నిర్ణయాలు వస్తాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఆ పొలిట్ బ్యూరోలో నేను లేను. నేను పార్టీలో చేరిన తర్వాత పెద్దగా సమయంలేదు. ఎన్నికలు వచ్చాయి. సమావేశాల్లో పాల్గొన్నాను. నాకు ఇవ్వాల్సిన సలహాలు నేనిచ్చాను' అని చెప్పారు. పార్టీలో ఒక్కరే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని లక్ష్మీనారాయణ అన్నారు. అందరూ చర్చించాకే ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు. అప్పుడే నిర్ణయాన్ని అమలు చేయడంలో అందరూ చురుకుగా పాల్గొంటారని చెప్పారు.

  జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా లేఖ


  అయితే, గతంలో పవన్ కళ్యాణ్‌కు నిలకడ లేదని విమర్శిస్తూ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోవడాన్ని లక్ష్మీనారాయణ ఆక్షేపించారు. అయితే, అందుకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు.

  లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తూ పవన్ కౌంటర్


  ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలోనూ చేరలేదు. జనసేనతో బీజేపీకి పొత్తు ఉంది. ఈ క్రమంలో జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరతారా? లేదా అనే సందేహం ఉంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: