ఏది నిజం?... రాజధానిపై వైసీపీ... కేంద్రానికి చెప్పే చేస్తోందా?

ఏపీ రాజకీయాలు అంతా ఓపెనే అన్నట్లు కనిపిస్తున్నా... తెరవెనక ఏదో జరుగుతోందన్న డౌట్లు ప్రజల్లో ఉన్నాయి. రాజధాని తరలింపుపై క్లారిటీ ఇవ్వాల్సిన కేంద్రం సైలెంట్‌గా ఉంటుండటం సస్పెన్స్‌ను మరింత పెంచుతోంది.

news18-telugu
Updated: January 24, 2020, 6:11 AM IST
ఏది నిజం?... రాజధానిపై వైసీపీ... కేంద్రానికి చెప్పే చేస్తోందా?
వైఎస్ జగన్
  • Share this:
బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక... ఏపీ టు ఢిల్లీ టూర్లు వేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఏంటంటే... బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత పవన్ ఏమన్నారంటే... ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశంపై సీఎం జగన్ తమతో ఏమీ చర్చించలేదనీ... దానికి ముందుగా ఎలాంటి సమ్మతీ ఇవ్వలేదనీ... చర్చించినట్లుగా... కేంద్రం సమ్మతితోనే ఇదంతా చేస్తున్నట్లుగా వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని పవన్ అన్నారు. ఇదే నిజమైతే... రాజధాని తరలింపు నిర్ణయం అనేది ఏపీ వైసీపీ ప్రభుత్వం స్వయంగా తీసుకుందని మనం అనుకోవచ్చు. ఐతే... కొందరు వైసీపీ నేతలు మాత్రం... కేంద్రం సమ్మతితోనే తాము ఇలా చేస్తున్నామని అంటున్నారు. మరోవైపు... బీజేపీకి చెందిన ఏపీ నేతలు... వైసీపీ తమతో చర్చించకుండా, తమ అభిప్రాయం తెలుసుకోకుండా రాజధానిని తరలిస్తోందని అంటున్నారు. అలా అంటూనే... రాజధాని తరలింపుని తాము వ్యతిరేకించట్లేదనీ... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనీ, అమరావతి రైతులకు న్యాయం చెయ్యాలని తాము కోరుతున్నామని అంటున్నారు. అంతేకాదు... రాజధాని తరలింపు అంశం అనేది కేంద్రం పరిధిలో లేదనీ... దానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే కాబట్టి ఈ విషయంలో కేంద్రం చేయగలిగేది ఏమీ ఉండదని జీవీఎల్ లాంటి బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇలా... రాజధాని వికేంద్రీకరణ అంశంపై అటు వైసీపీ, ఇటు బీజేపీ భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి.

రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదే కావచ్చు. బట్... అమరావతిలో భూమిపూజ చేసింది కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందువల్ల ఈ విషయంపై మోదీ స్పష్టమైన ప్రకటన చెయ్యాలనీ, క్లారిటీ ఇవ్వాలనీ టీడీపీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు చెబుతున్న దానికి... వైసీపీ నేతలు చెబుతున్నదానికీ ఏమాత్రం పొంతన ఉండట్లేదనీ... జగన్, మోదీ మధ్య డీల్ కుదిరే ఉంటుందనీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి డీల్ ఏదీ కుదరలేదని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారే తప్ప... మోదీగానీ, అమిత్ షా గానీ, జేపీ నడ్డా గానీ చెప్పట్లేదు. వాళ్ల నోటితో చెబితేనే తప్ప నమ్మే పరిస్థితులు కనిపించట్లేదు.

కేంద్రం, వైసీపీ మధ్య ఏ డీలూ కుదరలేదని నడ్డా తనతో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ చెబుతున్నా... అసలు పవన్ కళ్యాణ్ మాటల్ని నమ్మే పరిస్థితులు లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే... రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని బీజేపీపై విమర్శలు చేసిన పవన్... ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపడం... ఇక జీవితంలో సినిమాలు చెయ్యనని చెప్పిన పవన్... ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు రెడీ అవుతుండటం... ఇలాంటి అంశాలు... పవన్ కళ్యాణ్‌పై నమ్మకాన్ని పోగొట్టేశాయని అంటున్నారు. అందువల్ల అమరావతి నుంచీ.... పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తున్న అంశంలో కేంద్రం, వైసీపీ మధ్య డీల్ కుదిరిందా లేదా? కేంద్రం అనుమతి తీసుకొనే... జగన్ ఈ పని చేస్తున్నారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అది వచ్చే వరకూ... బీజేపీ నేతల మాటల్ని నమ్మే పరిస్థితులు కనిపించట్లేదు.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు