Home /News /politics /

IS TELANGANA BJP GETTING READY FOR EARLY POLLS AFTER MEETING WITH AMIT SHAH AK

Telangana Politics: తెలంగాణలో బీజేపీ అందుకు రెడీ అవుతోందా ? ఈ సంకేతాలన్నీ అవేనా ?

అమిత్ షా, బండి సంజయ్(ఫైల్ ఫోటో)

అమిత్ షా, బండి సంజయ్(ఫైల్ ఫోటో)

Telangana Bjp: అమిత్ షాతో సమావేశం తరువాతే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

    తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై సీరియస్‌గా దృష్టిపెట్టారు కమలనాథులు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కమలనాథులు.. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. ఇటీవల రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, కార్యకర్తలతో సమావేశమైన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. తాజాగా తెలంగాణలోని 12 ఎస్సీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ఎంతో కీలకం.

    ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన బీజేపీ.. ఇప్పటి నుంచే ఆయా స్థానాలపై ఫోకస్ పెంచింది. అక్కడ ముందుగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఎన్నికలకు కొన్ని నెలల ముందే అక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడంపై రాష్ట్ర బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ దూకుడు చూస్తుంటే.. ఆ పార్టీ ముందస్తు ఎన్నికల కోసం రెడీ అవుతోందా ? అనే చర్చ కూడా సాగుతోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం చాలాకాలం ముందు నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయి. ఇదేమీ కొత్త ప్రక్రియ కాదు. కానీ బీజేపీ మాత్రం ఈ విషయంలో మరింత దృష్టి పెట్టడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది.

    కొద్దిరోజుల క్రితం బీజేపీ ముఖ్యనేత,కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు తెలంగాణ ముఖ్యనేతలు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై అమిత్ షా వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. గతంలోనూ ఎవరూ ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్... విపక్షాలు ఎన్నికలకు సిద్ధం కాకముందే అంతా రెడీ చేసుకున్నారు.

    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. పూర్తి వివరాలు

    ఆ సీట్లపై కన్నేసిన Telangana Bjp.. 2 నెలలు పాదయాత్ర.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

    అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం సాధించారు. ఈసారి ఎన్నికలకు కాస్త ముందుగానే వచ్చే అవకాశం ఉండటంతో.. రాష్ట్ర బీజేపీ నేతలు అందుకు సిద్ధంగా ఉండాలని అమిత్ షా వారికి స్పష్టం చేశారు. పార్టీ ఎక్కడెక్కడ కాస్త బలహీనంగా ఉందో.. అక్కడ ఎక్కువగా దృష్టి పెట్టాలని తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు. అమిత్ షాతో సమావేశం తరువాతే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు