ఏపీ టీడీపీ ఖాళీ అవుతుందా... ప్రతిపక్ష హోదా పోతుందా?

Andhra Pradesh Updates : ఈ రోజుల్లో రాజకీయ నేతలు కూడా కమర్షియల్‌గా ఆలోచిస్తున్నారా... నాకేంటి లాభం అన్న ధోరణి వల్ల టీడీపీ అడ్డంగా నష్టపోయే పరిస్థితి రాబోతుందా?

Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 8:15 AM IST
ఏపీ టీడీపీ ఖాళీ అవుతుందా... ప్రతిపక్ష హోదా పోతుందా?
చంద్రబాబు (File)
Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 8:15 AM IST
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక... ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరతీసి... 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకుంది టీడీపీ. ఇప్పుడు కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ పార్టీకి... ముందుంది మొసళ్ల పండుగ అంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీ లాగా తాము ఫిరాయింపులకు ప్రోత్సహించే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత, సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించడంతో... ఆపరేషన్ ఆకర్ష్ అనేది వైసీపీ నుంచీ ఉండకపోయినా... టీడీపీకి రాజీనామా చేసి... తిరిగి ఉప ఎన్నికలు రప్పించి... వాటిలో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచే ఆలోచనలో ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ప్లాన్స్ వేసుకుంటున్నట్లు తెలిసింది.

జంప్ అవ్వాలనే ఆలోచన ఎందుకు? : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకోవడంతో... ఈ ఐదేళ్లూ ఆ పార్టీకి తిరుగుండదని టీడీపీ నేతలు భావించడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. ఐతే... ఐదేళ్ల తర్వాత కూడా మళ్లీ ఎపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీయేనన్నది కొందరు టీడీపీ నేతల ఆలోచన. ఇందుకు రెండు కారణాలున్నాయి. 1.వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా... 2024 ఎన్నికల్లో ఆ పార్టీ బలం తగ్గినా... దాదాపు ఓ 50 సీట్లు కోల్పోయినా... అప్పటికీ భారీ మెజార్టీతో (101 = మేజిక్ మార్క్ 88+13) అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. 2.ఇప్పటికే ఏజ్ ఎక్కువైన చంద్రబాబుకి 2024లో మరింత ఏజ్ పెరగడం, అదే సమయంలో... పార్టీలో నెంబర్ 2గా చెప్పుకుంటున్న నారా లోకేష్ తాను పోటీ చేసిన చోటే గెలవలేక అసమర్థుడిగా ముద్రపడి... 2024లో పార్టీని నడిపించేంత సీన్‌లో ఉండరన్నది మరో విశ్లేషణ. ఈ రెండు కారణాల వల్ల... పదేళ్ల పాటూ వైసీపీ అధికారంలో ఉంటుందనీ, అందువల్ల టీడీపీని వదిలెయ్యడం బెటరని కొందరు ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది.

ప్రతిపక్ష హోదా పోయినట్లేనా : అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కలిగి ఉండాలంటే... మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు సాధించి ఉండాలి. ఆ రకంగా చూస్తే... టీడీపీు కనీసం 18 సీట్లు సాధించి ఉండాలి. ప్రస్తుతం 23 సీట్లు ఉన్నాయి కాబట్టి... ప్రతిపక్ష హోదాకు సమస్యేమీ లేదు. ఐతే... ఓ ఆరుగురు ఎమ్మెల్యేలు... ఏవేవో కారణాలు చెప్పి... తమ పదవులకు రాజీనామా చేసి, టీడీపీకి గుడ్ బై చెప్పారంటే... ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. ఐతే... ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటారా అంటే... బయటకు చెప్పకపోయినా... కొందరు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ పొజిషన్ ఎలా ఉందో చూసుకొని... నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది. అంటే... స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఫెయిలైతే... ప్రతిపక్ష హోదా పోయే ప్రమాదం పొంచి ఉందనుకోవచ్చు.

రోజులు మారాయా? : ఒకే పార్టీలో ఉండాలి, ఓడినా గెలిచినా ఆ పార్టీతోనే అనుకునే రోజులు కావివి. చాలా మంది ప్రజా ప్రతినిధులు... స్వలాభం చూసుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీతో జట్టు కట్టేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. అక్కడలా ఏపీలో ఫిరాయింపులకు ఛాన్స్ లేకపోయినప్పటికీ... ప్రస్తుతం వైసీపీకి ఉన్న క్రేజ్‌ని బట్టీ... టీడీపీ ఖాళీ అయినా ఆశ్చర్యం అక్కర్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...