Home /News /politics /

IS TDP LEADER GOT CLARITY ON CHANDRABABU NAIDU WILL LEAD THE PARTY IN THE NEXT ASSEMBLY ELECTIONS AK

Chandrababu: మళ్లీ చంద్రబాబే.. టీడీపీ నేతలకు క్లారిటీ.. ఆ తరువాతే ఆయనకు ఛాన్స్..

చంద్రబాబునాయుడు (ఫైల్ ఫోటో)

చంద్రబాబునాయుడు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: గోరంట్ల వంటి సీనియర్ నేతల సలహాలను పరిగణనలోకి తీసుకున్నారో లేక లోకేశ్‌పై ఇప్పుడప్పుడే పూర్తిస్థాయిలో సారథ్య బాధ్యతలు వద్దని అనుకున్నారో తెలియదు కానీ.. మళ్లీ చంద్రబాబే యాక్టివ్ అయ్యారు.

    ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఏపీ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మరోసారి పీకే టీమ్, వ్యూహాలను అమలు చేసేందుకు వైసీపీ సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. వైసీపీ పనితీరు, వచ్చే ఎన్నికల్లో అజెండాను ఫిక్స్ చేసే అంశంపై పీకే టీమ్ పని చేస్తోందనే చర్చ జరుగుతోంది. వైసీపీ చర్యలతో టీడీపీ (TDP) కూడా అప్రమత్తమైంది. కాస్త సైలెంట్‌గా ఉన్న టీడీపీకి.. ఆ పార్టీ కార్యాలయంపై దాడి, పట్టాభి ఇంటిపై దాడి ఘటనలు కొంతవరకు రాజకీయంగా కలిసొచ్చాయి. ఈ ఘటనలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన చంద్రబాబుకు ఢిల్లీలోనూ నిరాశే ఎదురైందనే వార్తలు వచ్చాయి. అయితే టీడీపీ వర్గాల్లో ఉన్న సందేహాలకు ఈ మధ్య క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. 2019లో టీడీపీ ఓటమి తరువాత పార్టీకి యువరక్తం అవసరమనే చర్చ జరిగింది.

    సీఎం జగన్‌ను ప్రజలు ఆదరించడంలో అది కూడా ఓ కారణమనే వాదనలు వినిపించాయి. దీంతో టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) పార్టీకి నాయకత్వం వహిస్తారని.. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఇందుకు సిద్ధమవుతాడనే వార్తలు వచ్చాయి. నారా లోకేశ్ సైతం అందుకు తగ్గట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. కరోనా సమయంలో చంద్రబాబు (Chandrababu) హైదరాబాద్‌లోనే ఎక్కువకాలం ఉండగా.. క్షేత్రస్థాయిలో పర్యటించే బాధ్యతలను లోకేశ్ భుజాన వేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మళ్లీ చంద్రబాబు యాక్టివ్ అయ్యారు.

    కరోనా తగ్గుముఖం పట్టడంతో చంద్రబాబు మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారనే చర్చ జరుగున్నప్పటికీ.. టీడీపీకి ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను లోకేశ్‌కు బదులుగా మళ్లీ చంద్రబాబే తీసుకోవాలని ఆ పార్టీలోని మెజార్టీ నేతలు కోరినట్టు తెలుస్తోంది. గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి సీనియర్ నేతలైతే.. లోకేశ్‌కు ఇప్పుడే అలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని.. చంద్రబాబుపై ఇంకా ప్రజలకు నమ్మకం ఉందని వ్యాఖ్యనించారు. వచ్చే ఎన్నికలను సైతం ఆయన సారథ్యంలోనే టీడీపీ ఎదుర్కోవాలని అన్నారు.

    KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?

    గోరంట్ల వంటి సీనియర్ నేతల సలహాలను పరిగణనలోకి తీసుకున్నారో లేక లోకేశ్‌పై ఇప్పుడప్పుడే పూర్తిస్థాయిలో సారథ్య బాధ్యతలు వద్దని అనుకున్నారో తెలియదు కానీ.. మళ్లీ చంద్రబాబే యాక్టివ్ అయ్యారు. కొంతకాలం నుంచి ఆయన పర్యటనలు, వ్యాఖ్యలు, ప్రభుత్వంపై ఆయన రాజకీయ దాడిని చూస్తున్నవారంతా.. వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబే టీడీపీని ముందుకు నడిపిస్తారనే విషయంలో ఆ పార్టీ నేతలకు ఓ క్లారిటీ వచ్చినట్టు రాజకీయవర్గాలు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో గెలిచిన తరువాత తన కుమారుడు లోకేశ్‌కు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పగ్గాలు, పార్టీ పగ్గాలు ఇవ్వడమో చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Chandrababu naidu, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు