స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి? కేసీఆర్ నిర్ణయం అదేనా?

తాజా ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసినా.. పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అంతకు ముందే అసెంబ్లీ కొలువుదీరనున్న నేపథ్యంలో.. కొత్త స్పీకర్ ఎవరనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

news18-telugu
Updated: January 12, 2019, 10:01 PM IST
స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి? కేసీఆర్ నిర్ణయం అదేనా?
kcr, pocharam file
news18-telugu
Updated: January 12, 2019, 10:01 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ.. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ నెలరోజుల పాలన పూర్తి చేసుకున్నా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అయితే, ఈలోపే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. అందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రకటించింది. ఇక స్పీకర్ ఎంపికే తరువాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు కాబోయే కొత్త స్పీకర్ ఎవరనే అంశంపై తీవ్రమైన సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఈ విషయంలో కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)


గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన పద్వా దేవేందర్ రెడ్డికి ఈసారి స్పీకర్‌గా ప్రమోషన్‌ లభిస్తుందనే ప్రచారం మొదట్లో జోరుగానే జరిగింది. అంతేకాదు, సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పేరును కూడా  స్పీకర్ పదవికోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు పుకార్లు వచ్చాయి. మరోవైపు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు ‌స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారనే రూమర్లు కూడా రాజకీయవర్గాల్లో భారీగానే షికారు చేశాయి. అయితే, ఎవరెన్ని ప్రచారాలు చేసినా ఫైనల్‌గా డిసిషన్ తీసుకోవాల్సింది కేసీఆరే. ఈ లెక్కన ఎవరిని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టాలన్నది పూర్తిగా ఆయన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.

కేసీఆర్‌తో పద్మా దేవేందర్‌ ఫైల్
కేసీఆర్‌తో పద్మా దేవేందర్‌ ఫైల్
అయితే, గతంలో స్పీకర్‌గా పనిచేసినవాళ్లు.. తమ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతారన్న సెంటిమెంట్ ప్రచారం జరగుతుండడంతో.. ఇప్పుడు తాజాగా గెలిచిన వాళ్లు స్పీకర్ పదవిని చేపట్టేందుకు జంకుతున్నారు. గత ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన మధుసూధనాచారారి తాజా ఎన్నికల్లో ఓడిపోవడం కూడా.. ఈ భయానికి కారణంగా తెలుస్తోంది. అయితే, అధినేత ఫిక్సయితే మాత్రం మారు మాట్లాడకుండా సీటులో వెళ్లి కూర్చోవాల్సి ఉంటుంది. అందుకే, కేసీఆర్ నోటివెంట ఎవరి పేరు వస్తుందోనన్న భయం నేతలను వెంటాడుతోంది.


పోచారం శ్రీనివాస రెడ్డి
పోచారం శ్రీనివాస రెడ్డి


స్పీకర్ పదవికోసం కేసీఆర్ ఆలోచిస్తున్న పేర్లలో.. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నట్టు కొత్తగా ప్రచారం జరుగుతోంది. అందరిలో పోచారం శ్రీనివాస్ రెడ్డివైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు సమాచారం. పోచారంతో కూడా మాట్లాడారని తెలుస్తోంది. స్పీకర్‌గా చేసినవాళ్లు తర్వాతి ఎన్నికలలో ఓడిపోతారన్న సెంటిమెంట్‌కు భయపడొద్దని , రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూస్తానని.. కేసీఆర్ భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
Loading...
కేసీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫైల్ ఫోటోలు
కేసీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫైల్ ఫోటోలు


అసెంబ్లీలో సీనియర్ నాయకుడై ఉండడం, సభలో సుధీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఉండడం వంటి కారణాలతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సో.. తెలంగాణ అసెంబ్లీకి కొత్త స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డే కాబోతున్నారా? కేసీఆర్ మనసులో మరెవరైనా ఉన్నారా? అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...