• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • IS NARA LOKESH TEAM UNHAPPY WITH JR NTR IF YES WHY BA BK

Jr NTR: టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చాక.. సీనియర్ల మధ్య జరిగిన చర్చ ఏంటి?

Jr NTR: టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చాక.. సీనియర్ల మధ్య జరిగిన చర్చ ఏంటి?

జూనియర్ ఎన్టీఆర్(ఫైల్ ఫొటో)

చంద్రబాబు కుప్పం వెళ్లిన త‌రువాత కార్య‌క‌ర్త‌ల నుంచి వచ్చిన రెస్పాస్ కు షాక్ అయ్యారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాల‌ని బాబు ముందే తెలుగు త‌మ్ముళ్లు గోల చేయ‌డం ఇప్పుడు పార్టీలో కీల‌క అంశంగా మారింది.

  • Share this:
    (ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 18)

    మ‌ళ్లీ అదే చ‌ర్చ‌... టీడీపీ పునాదులు క‌దులుతున్న‌ప్పుడ‌ల్లా ఏపీ రాజ‌కీయాల్లో అదే చ‌ర్చ తెర‌పైకొస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని డిమాండ్లు మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తోన్నాయి. టీడీపీ లో ప‌దే ప‌దే ఈ చ‌ర్చ ఎందుకు వ‌స్తోంది. అధినేత చంద్ర‌బాబు లోకేష్ ను ముందు పెట్టిన‌ప్ప‌టికి ఈ చ‌ర్చ కేడ‌ర్ జూనియ‌ర్ పైనే ఎందుకు దృష్ఠి పెడుతుంది. ఎందుకు ఆయ‌నే రావాలి అని డిమాండ్లు వినిపిస్తోన్నాయ‌న్న‌దే ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం త‌రువాత పార్టీలో కేడ‌ర్ డీలా ప‌డిపోయారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత స్పీడ్ చూసి చాలా మంది టీడీపీ కంటే బీజేపీనే సేఫ్ అంటూ ఆ పార్టీ కండువాలు క‌ప్పుకున్నారు. గంటా శ్రీనివాస్ లాంటి మిగిలిన నేత‌లు అస‌లు పార్టీలో ఉన్న‌ట్ల లేన‌ట్ల అనేది బాబుకు కూడా అర్ధం కావ‌డం లేదు.

    చాలా మంది పార్టీకి దూరంగా ఉంటూ సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పంచాయితీ ఎన్నిక‌ల ఫ‌లితాలు బాబుతోపాటు పార్టీ కేడ‌ర్ ను కూడా ఇంకా కుదేలు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫ‌లితాలు ఎలా ఉన్నా బాబు సొంత నియోక‌వ‌ర్గం కుప్పంలో వ‌చ్చిన ఫ‌లితాలు చంద్ర‌బాబును కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నాయి. వాస్త‌వానికి బాబు కుప్పం టూర్ వెనుక ఉన్న కారణం కూడా ఈ ఫ‌లితాలే. అయితే తీరా అక్క‌డ‌కు బాబు వెళ్లిన త‌రువాత కార్య‌క‌ర్త‌ల నుంచి రెస్పాస్ కు షాక్ అయ్యారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాల‌ని బాబు ముందే తెలుగు త‌మ్ముళ్లు గోల చేయ‌డం ఇప్పుడు పార్టీలో కీల‌క అంశంగా మారింది. అస‌లు పార్టీ ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుంద‌నే చ‌ర్చ సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. లోకేష్ బాబు ని ముందు పెట్టిన ఎందుకు కేడ‌ర్ జూనియ‌ర్ కావాల‌ని డిమాండ్ చేస్తోన్నార‌నే అంశంపై పార్టీలో కొంద‌రు నేత‌లు చాలా సీరియ‌స్ గా ఆలోచిస్తోన్న‌ట్లు స‌మాచారం.

    ఇదిలా ఉంటే 2009 ఎన్నిక‌ల్లో పార్టీ త‌రుపున ప్ర‌చారానికి వ‌చ్చారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయిన‌ప్ప‌టికి ఆయ‌న ప్ర‌సంగాలు మాత్రం ప‌బ్లిక్ కి విప‌రితంగా న‌చ్చేశాయి. అప్పుడు ఆయ‌న ఒక మంచి రాజ‌కీయ నేత అవుతారాని స‌ర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అయితే త‌రువాత అడ‌పాద‌డ‌పా అక్క‌డ‌క్క‌డ క‌నిపించ‌డం త‌ప్ప ఆయ‌న పెద్ద‌గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఎప్పుడు క‌నిపించ‌లేదు. అయితే గ‌తంలో త‌న స్నేహితుడు కొడాలి నాని వైసీపీలో చేరిన‌ప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కు టీడీపీకి గ్యాప్ వ‌చ్చింద‌నే వార్త హాల్ చ‌ల్ చేసింది. దీంతో ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి మ‌రి త‌న క‌ట్టెకాలే వ‌ర‌కు టీడీపీతోనే ఉంటాని చెప్పారు. అయితే టీడీపీ పునాదులు క‌దుతున్న‌పుడ‌ల్లా జూనియ‌ర్ ఎన్టీఆర్ మాట వినిపించ‌డం లోకేష్ వ‌ర్గం జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్లు స‌మాచారం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు