టీడీపీపై బాలకృష్ణ చిన్నల్లుడు అసంతృప్తి నిజమేనా?

బాలకృష్ణ, శ్రీ భరత్

రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా విశాఖపట్నంలో క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. అక్కడ పోటీ చేసిన శ్రీభరత్ చాలా విషయాల్లో అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది.

 • Share this:
  నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, ‘ముద్దుల మామయ్య’ మీద అలిగాడా? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో దీనిపై చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బాలకృష్ణ పట్టుబట్టి తన చిన్నల్లుడు శ్రీభరత్‌కు విశాఖపట్నం ఎంపీ టికెట్ ఇప్పించారు. అయితే, ఎన్నికల తర్వాత జరుగుతున్న విశ్లేషణలు చూస్తుంటే, అక్కడ శ్రీభరత్ ఓడిపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా విశాఖపట్నంలోనే క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీకి ఏ పార్టీకి ఓటు వేసినా... పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి శ్రీభరత్‌కు పోటీగా జనసేన తరఫున బరిలో దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు అనుకూలంగా పోలింగ్ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది.

  Andhra Pradesh news, Andhra Pradesh politics, Nandamuri Balakrisha, Nandamuri Balakrishna son in laws, Nara lokesh, Sribharat, bharat, TDP, chandrababu naidu, mangalagiri, vishakapatnam mp seat, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నందమూరి బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ అల్లుళ్లు, నారా లోకేశ్, శ్రీభరత్, టీడీపీ, చంద్రబాబునాయుడు, మంగళగిరి, విశాఖపట్నం ఎంపీ సీటు
  బాలకృష్ణ, నారా లోకేశ్, శ్రీభరత్


  బాలకృష్ణ తన అల్లుడికి టికెట్ ఇప్పించడంలో చూపిన శ్రద్ధ, గెలిపించడంలో చూపించలేదనే శ్రీభరత్‌కు దగ్గరి వారు వ్యాఖ్యానిస్తున్నట్టుగా సమాచారం. శ్రీభరత్‌కు టికెట్ విషయంలో చంద్రబాబు అంతగా ఆసక్తి చూపకపోయినా, బాలకృష్ణ ఒత్తిడి మేరకే టికెట్ ఇచ్చారనే వాదన ఉంది. అదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరడానికి ముందు చంద్రబాబును కలిశారని, అదే లక్ష్మీనారాయణ విశాఖలో పోటీ చేయడంతో టీడీపీ కేడర్ కూడా అసెంబ్లీ సంగతి ఎలా ఉన్నా... పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బాలయ్య పెద్దగా పట్టించుకోకపోయినా, విశాఖ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులు కూడా శ్రీభరత్‌ను పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు.

  ap election 2019, ap poll 2019, Lok Sabha Election 2019, chandrababu naidu, nara lokesh, ఏపీ ఎన్నికలు, చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఉండవల్లి, ఓటు హక్కు
  ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం


  తొలిసారి ఎన్నికల్లో దిగిన శ్రీభరత్ ఇవన్నీ చూసి కొంత అలకబూనినట్టు చర్చ జరుగుతోంది. అయితే, శ్రీభరత్‌కు ఇవి తొలి ఎన్నికలే అయినా, ఆయనకు ఇంకా చాలా కెరీర్ ఉందని, ఇప్పుడు కాకపోతే మరోసారైనా ఆయన కచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తారని నందమూరి కుటుంబం అభిమానులు చెబుతున్నారు. శ్రీభరత్‌ తాత ‘గీతం’ మూర్తి కూడా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. విశాఖ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఓసారి ఏపీ శాసనమండలికి ఎన్నికయ్యారు. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి అలిగినా, అటు తాత వారసత్వం, ఇటు మావయ్య అండతో రాబోయే రోజుల్లో మళ్లీ క్రియాశీలకం అవుతారని నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు.
  First published: