• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • IS MEGASTAR CHIRANJEEVI BEHIND RAJINIKANTH POLITICAL STEP BACK AK

Rajinikanth: రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి ఆ హీరో బ్రేక్ వేశారా ?

Rajinikanth: రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి ఆ హీరో బ్రేక్ వేశారా ?

రజినీకాంత్(ఫైల్ ఫొటో)

Rajinikanth: రాజకీయాల్లోకి వెళితే చాలా మారాల్సి ఉంటుందని.. మానసిక ప్రశాంతత కూడా కోల్పోవాల్సి వస్తుందని చిరంజీవి రజినీకాంత్‌కు చెప్పారని కొందరు చర్చించుకుంటున్నారు.

  • Share this:
    రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి అభిమానులతో పాటు తమిళ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టించిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే రాజకీయాలకు రాం రాం చెప్పేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని.. అందుకే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గుతున్నట్టు రజినీకాంత్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఇందుకు అభిమానులు, ప్రజలు తనను క్షమించాలని లేఖ ద్వారా కోరారు. అయితే అసలు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావద్దని నిర్ణయించుకోవడానికి కారణం ఏమిటనే దానిపై తమిళ రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రజినీకాంత్.. తనకు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనే దానిపై రెండు మూడు సంస్థల ద్వారా సర్వే చేయించారట. ఈ సర్వేల్లో వచ్చిన ఫలితాలు చూసి రజినీకాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యారట. రజినీకాంత్‌ ఏర్పాటు చేయబోయే పార్టీకి 20కు మించి సీట్లు వచ్చే అవకాశం లేదని ఆ సర్వే రిపోర్టులు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ సర్వే ఫలితాలు చూసిన తరువాత రజినీకాంత్‌కు ఏపీలో చిరంజీవి ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ఉదంతం గుర్తుకు వచ్చినట్టు కొందరు చర్చించుకుంటున్నారు.

    chiranjeevi starred old movie title for the super star rajinikanth new movie title,super star rajinikanth,chiranjeevi,rajinikanth,rajinikanth new movie annayya,rajinikanth next movie annayya title,rajinikanth annathe,tollywood,telugu cinema,రజినీకాంత్,చిరంజీవి,రజినీకాంత్ అన్నయ్య,రజినీకాంత్ అన్నయ్య టైటిల్,రజినీకాంత్ అన్నయ్యరజినీకాంత్ అన్నయ్య టైటిల్,చిరంజీవి రజినీకాంత్
    చిరంజీవి రజినీకాంత్ (Source: Twitter)


    రాజకీయాల్లో రాణించలేకపోతే.. మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెట్టారు చిరంజీవి. మళ్లీ రాజకీయాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో రజినీకాంత్ కూడా చిరంజీవి తరహాలోనే ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్‌లో ఉన్న సమయంలో రజినీకాంత్ చిరంజీవితో ఈ అంశం గురించి మాట్లాడారని వార్తలు వినిపిస్తున్నాయి. మనలాంటి వాళ్లు రాజకీయాలకు సరిపోరని.. అక్కడ రాణించడం అంత సులువు కాదని చిరంజీవి రజినీకాంత్‌కు చెప్పారని తెలుస్తోంది.

    రాజకీయాల్లోకి వెళితే చాలా మారాల్సి ఉంటుందని.. మానసిక ప్రశాంతత కూడా కోల్పోవాల్సి వస్తుందని చిరంజీవి రజినీకాంత్‌కు చెప్పారని కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి చేయొద్దని రజినీకాంత్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చెప్పినట్టు సమాచారం. అంతలోనే రజినీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గురికావడం కూడా ఆయన రాజకీయాల నుంచి వెనక్కి తగ్గేందుకు కారణమైందని తెలుస్తోంది. మొత్తానికి రాజకీయాల్లోకి రాకముందే రజినీకాంత్ నో పాలిటిక్స్ అనడం వెనుక చిరంజీవి పాత్ర కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: