Mandava: టీఆర్ఎస్ పార్టీకి మండవ గుడ్ బై కొట్టబోతున్నారా?

Mandava Venkateswar Rao to Join BJP? | మండవ వెంక‌టేశ్వ‌ర్ రావు కారు దిగిపోతారని, కమ‌ల‌దళం వైపు చూస్తున్న‌ార‌ని గుస‌గులు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: August 26, 2020, 9:30 PM IST
Mandava: టీఆర్ఎస్ పార్టీకి మండవ గుడ్ బై కొట్టబోతున్నారా?
మండవ వెంకటేశ్వరరావు
  • Share this:
Mandava Venkateswar Rao Latest News | ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నిజామాబాద్ సీనియర్ నేత‌, వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న లీడర్. తెలుగు దేశం పార్టీలో ఎన్టీఆర్‌, చంద్రబాబుతో కలిసి ప‌నిచేసిన నాయ‌కుడు. ఇదంతా బాగానే ఉన్నా పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరూ ఊహించని విధంగా కారెక్కారు. ఆయ‌నే మండ‌వ వెంక‌టేశ్వ‌ర్ రావు. సీఎం కేసీఆర్ స్వ‌యంగా మండవ ఇంటికి వెళ్లి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అప్ప‌టి నుంచి మండవకు పెద్ద పదవే ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. కాని ఆయ‌ను ఎలాంటి ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో మండ‌వ‌ వ్యూహం ఎంటి? కారు దిగి క‌మ‌లం కండువ క‌ప్పుకోనున్నారా?

మండవ వెంకటేశ్వరరావు, కల్వకుంట్ల కవిత


ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ల‌కు రైట్ హ్యాండ్ గా ఉండేవారు. నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా గుర్తింపు పొందారు. తన సామాజిక వర్గానికి అండ‌గా నిలిచారు. తెలంగాణలో టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి స్థ‌బ్దంగా ఉన్న‌ మండవ వెంక‌టేశ్వ‌రరావు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికలకంటే ముందు పాత స్నేహంతో సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపి గులాబీ పార్టీలోకి అహ్వనించారు. కేసీఆర్‌కు మండవకు మంచి స్నేహం ఉండటంతో కాదనలేక పోయారు. దీంతో సైకిల్ దిగి కారేక్కేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న సురేష్ రెడ్డి, ఇటు మండవ ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ ఎంపీగా కవిత ఓడిపోయారు. ఈ ఓట‌మితో మండ‌వ రాజ‌కీయ భ‌విష‌త్తు తారుమారైంది. ఎంపీగా క‌విత‌ను గెలిపించి ఉంటే సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెంచి త‌న‌కు ఎదైనా ప‌ద‌వి కావాల‌ని అడిగేవారు. కానీ కవిత ఓట‌మి కార‌ణంగా ఏంచేయ‌లేని ప‌రిస్థితి. దీంతో రాజకీయ భవిష్యత్‌ అంధకారంలో పడింది. కానీ అనుహ్యంగా సురేష్ రెడ్డికి రాజ్యసభ సీటిచ్చేశారు. మండవకు మాత్రం ఎలాంటి ప‌ద‌వి దక్కకపోగా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మండవకు పదవి వస్తుందా లేదా అనే ప్రశ్న అతనితో పాటు ఆయని అనుచరులను కూడా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని అడగాలో ఎం చేయాలో తెలియని పరిస్థిలో ఉన్నారట. పార్టీ మారాలనే ఒత్తిడి కూడా అనుచరుల నుంచి పెరుగుతుందట. కారు ప్రయాణం సంవత్సరం గడిచినా ఎలాంటి పదవి రాక‌పోవ‌డంతో అస‌హ‌నంతో ఉన్నారట.

మండవ వెంకటేశ్వరరావు


గతంలో డీఎస్ కి ఇచ్చిన ప్రభుత్వ సలహదారు పదవిని మండవకు ఇద్దామనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని వినిస్తుంది. అయితే ఆ పదవి తీసుకోవాలా వద్దా అనే ఆలోచ‌న‌ మండవ ఉన్న‌డ‌ని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి దీనికి బలం చేకూర్చుతుంది. దీంతో పాటు గత కొద్ది రోజులుగా మండవ పార్టీ కార్యక్రమంలో అసలు పాల్గొన్న ప‌రిస్థితి లేవు. ఈ నేపథ్యంలో కారు దిగి కమలం కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక అటు నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్‌ తన పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవి మండవకు కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తారో.. మండవకి రాజ్యసభ ఎప్పుడొస్తుందో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

మండవ వెంక‌టేశ్వ‌ర్ రావు కారు దిగిపోతారని, కమ‌ల‌దళం వైపు చూస్తున్న‌ార‌ని గుస‌గులు వినిపిస్తున్నాయి. డీఎస్ తో ఉన్న స్నేహం, డీఎస్ త‌న‌యుడు ధర్మ‌పురి ఆర్వింద్ ఎంపీగా ఉండ‌డంతో పాటు బీజేపీ బ‌లం పెంచుకోవాడానికి మండ‌వ అవ‌స‌రం అని బీజేపీ భావిస్తుంది. మ‌రి మండ‌వ టీఆర్ఎస్ ను వీడతారా? క‌మ‌లద‌ళంలో చేరుతారా చూడాలి.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 26, 2020, 9:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading