Home /News /politics /

IS JANASENA PRESIDENT PAWAN KALYAN DECIDED TO LEAVE GAJUWAKA AND RESTRICT TO BHIMAVARAM OF AP AK

పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాన్ని వదులుకుంటారా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్

గత ఎన్నికల్లో పశ్చిమ గోదావర జిల్లా భీమవరంతో పాటు విశాఖ జిల్లాకు చెందిన గాజువాక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్. అయితే అనూహ్యంగా రెండు స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు.

    గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైన జనసేన... వచ్చే ఎన్నికల నాటికి బలమైన రాజకీయశక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. జనసేనను ఏ పార్టీలో విలీనం చేసే ఆలోచన తనకు లేదని... ఈ విషయంలో వచ్చే వదంతులను పార్టీ కార్యకర్తలను నమ్మొద్దని ఆయన పలుసార్లు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీని కొనసాగించే విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు సాగుతున్నా... గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం విషయంలో మాత్రం జనసేన అధినేత ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    గత ఎన్నికల్లో పశ్చిమ గోదావర జిల్లా భీమవరంతో పాటు విశాఖ జిల్లాకు చెందిన గాజువాక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్. అయితే అనూహ్యంగా రెండు స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. భీమవరంలో 7 వేలపైచిలుకు ఓట్ల తేడాతో పవన్ ఓటమి పాలుకాగా... గాజువాకలో 16 వేలపైచిలుకు ఓట్ల తేడాతో పరాజయాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ గాజువాక నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల భీమవరం నియోజకవర్గంలో పర్యటించిన పవన్... మరోసారి తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

    పొగొట్టుకున్న చోటే రాబట్టుకోవడం తనకు అలవాటు అంటూ మళ్లీ భీమవరం నుంచే బరిలోకి దిగుతానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. భీమవరం విషయంలో ఇంత క్లారిటీగా ఉన్న పవన్... గాజువాక నుంచి మరోసారి పోటీ చేసే విషయంలో మాత్రం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. భీమవరంతో పోల్చితే గాజువాకలో అత్యధిక ఓట్ల తేడాతో ఓటమి చెందడం కూడా పవన్ గాజువాకను పక్కనపెట్టడానికి కారణమై ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మరోసారి భీమవరం నుంచి బరిలోకి దిగుతానని స్పష్టత ఇచ్చిన పవన్... గాజువాక విషయంలోనూ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Gajuwaka, Janasena, Pawan kalyan, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు