దేశ రెండో రాజధానిగా హైదరాబాద్.. మోదీ సర్కార్ ప్లాన్ అదేనా..?

Hyderabad | National Second Capital | పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశ రాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని అంబేడ్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తే మంచిదని సూచించారు.

news18-telugu
Updated: November 8, 2019, 9:11 AM IST
దేశ రెండో రాజధానిగా హైదరాబాద్.. మోదీ సర్కార్ ప్లాన్ అదేనా..?
చార్మినార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
నాలుగు వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుసంపన్న నగరం.. హైదరాబాద్. స్వాతంత్ర్యానికి పూర్వమే సకల సౌకర్యాలను తనలో చేర్చుకున్న భాగ్య(మైన) నగరం. అసెంబ్లీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఎయిర్‌పోర్టు, కంటోన్మెంటు, అతిథి గృహాలు, డ్రైనేజి వ్యవస్థ, ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషన్, ప్రత్యేక కరెన్సీ వ్యవస్థ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు.. ఇలా సుశోభితంగా విలసిల్లిన నగరం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ సైతం ఈ నగరాన్ని చూసి ముగ్ధుడయ్యారు. పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశ రాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీలైతే ఏడాదికి ఒకసారైనా పార్లమెంటు సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారాయన. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తే మంచిదని సలహా కూడా ఇచ్చారు. ఆయన సూచన మేరకే హైదరాబాద్ రాష్ట్రపతి రెండో విడిదిగా మారింది. అయితే, పరిస్థితుల దృష్ట్యా ఆయన సూచనను పక్కన పెట్టేయాల్సి వచ్చింది.

ఇప్పుడు ఆయన సూచనను ఎన్డీయే సర్కారు అమలు చేయబోతోందా? దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను మార్చబోతోందా? అవుననే చర్చ జరుగుతోంది. మరి, ఇన్నేళ్లుగా జరగని చర్చ ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? అసలు మోదీ సర్కారు వ్యూహం ఏంటి? అంటే..ఉత్తరాదిలో బీజేపీ వేళ్లూనుకుంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా ఏ చోట కూడా ఆ పార్టీ పటిష్ఠంగా లేదు. కొన్ని చోట్ల మినహా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ప్రాబల్యం లేదు. అందుకే ఇక్కడ తన బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న ఆలోచన అని జోరుగా చర్చ జరుగుతోంది.

రాజధానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు, వాతావరణం హైదరాబాద్‌కు ఉన్న నేపథ్యంలో.. మోదీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ నిర్ణయం మోదీకి, బీజేపీకి లాభిస్తుందని, అందుకే ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని వెల్లడిస్తున్నారు. ఎన్నో పార్టీలు హైదరాబాద్‌ను రెండో రాజధానిగా మార్చాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ ఇప్పుడు దక్షిణాదిలో కమల వికాసానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధి, ఉపాధి అవకాశాలే కాదు వాతావరణం కూడా భాగ్యనగరంలో అత్యుత్తమం.. దీంతో అందరి దృష్టి దీనిపై పడిందని వాదిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దు.. తదితర సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న మోదీ, అమిత్ షా.. హైదరాబాద్‌ను రెండో దేశ రాజధానిగా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. మరి మోదీ ఏం ఆలోచిస్తున్నారో అమలయ్యే దాకా వేచిచూడాల్సిందే..!
First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading