రాజధాని కమిటీ సిఫార్సు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా..?

ఏపీ రాజధాని వ్యవహారాన్ని తేల్చేందుకు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించి సీఎం జగన్ జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ సందర్భంగా ఆ కమిటీ ఇటీవల కర్నూలులో పర్యటించింది.

news18-telugu
Updated: November 18, 2019, 12:27 PM IST
రాజధాని కమిటీ సిఫార్సు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా..?
వైఎస్ జగన్
  • Share this:
తెలంగాణ నుంచి విడిపోయాక ఏపీకి కొత్త రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయబోతున్నట్లు అప్పటి సీఎం చంద్రబాబు నాయడు ప్రకటించారు. రాజధాని చుట్టూ పలు అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు పెట్టబోతున్నట్లు చెప్పారు. రాజధానికి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే.. చంద్రబాబు అధికారం కోల్పోయి వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారం చేపట్టారు. కొన్ని రోజులకే అమరావతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు రాజధాని నిర్మాణానికి అమరావతి అనుకూలం కాదన్న వాదన తెరపైకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రజల్లో కలవరం మొదలైంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు కూడా రాజధాని మార్పు గురించి మాట్లాడారు. అదీకాక.. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లో రాజధాని లేదు. అమరావతి అని గతంలో ప్రకటించినా.. మ్యాప్‌లో గుర్తించలేదు. దీంతో రాజధాని మార్పు ఉంటుందని ప్రజలు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో.. ఏపీ రాజధాని వ్యవహారాన్ని తేల్చేందుకు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించి సీఎం జగన్ జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది.

ఈ సందర్భంగా ఆ కమిటీ ఇటీవల కర్నూలులో పర్యటించింది. అంతేకాదు.. ఓర్వకల్ విమానాశ్రయం సమీపంలో భూమిని సిద్ధం చేయాలని అధికారులు సూచనలు కూడా చేసింది. ఈ సూచనే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి తెరతీస్తోంది. ఈ కమిటీ సూచనపై పలు రకాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఏర్పాటు కోసం ఈ భూములను సిద్ధం చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ.. అధికారులు భూముల సేకరణకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అయితే.. కమిటీ సూచన నేపథ్యంలో రాజధానిగా కర్నూలును సీఎం జగన్ ప్రకటిస్తారా? అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు.. శాశ్వత మంచినీటి సరఫరా సౌకర్యానికి ఏర్పాట్లు చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేయడంతో ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేస్తారేమోనని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజధాని నిర్మాణం జరగకపోగా, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు గడుస్తోంది. అయినా.. దీనిపై క్లారిటీ రాకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
First published: November 18, 2019, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading