IS CONGRESS MLA JAGGA REDDY WAITING FOR TIME TO TARGET TPCC CHIEF REVANTH REDDY AK
ఆ Congress MLA సైలెంట్ అయ్యారా ?.. మళ్లీ సమయం కోసం ఎదురుచూస్తున్నారా ?
ప్రతీకాత్మక చిత్రం
Telangana Congress: రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న జగ్గారెడ్డి.. ఈ విషయంలో నిజంగానే సైలెంట్ అయ్యారా లేక మళ్లీ సమయం కోసం ఎదురుచూస్తున్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. మిగతా పార్టీల్లోని నేతల్లో క్రమశిక్షణ ఎక్కువగా కనిపిస్తే.. కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఈ విషయంలో స్వేచ్ఛ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదే తమ పార్టీ గొప్పతనం అని ఆ పార్టీ నేతలు, శ్రేణులు చెబుతుంటారు. అయితే ఇదే ఆ పార్టీకి చాలాసార్లు మైనస్ అవుతుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానిక ఇది కూడా ఒక కారణమనే టాక్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ.. ఆయనను టార్గెట్ చేసే విషయంలో పలువురు నేతలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలాంటి వారిలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి.. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో రచ్చ క్రియేట్ చేశారు. రేవంత్ రెడ్డిపై ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తరువాత ఆయన సైలెంట్ అయ్యారు. సంక్రాంతి తరువాత ఢిల్లీ వెళ్లి హైకమాండ్ నేతలను కలుస్తానని చెప్పారు.
అయితే సంక్రాంతి గడిచిన తరువాత కూడా జగ్గారెడ్డి మౌనంగానే ఉన్నారు. ఢిల్లీ బాట పట్టలేదు. దీంతో జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో క్లాస్ తీసుకుని ఉంటుందని.. అందుకే ఆయన సైలెంట్ అయిపోయారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ కాంగ్రెస్‌లో ఈ విషయంలో కొత్త చర్చ కూడా సాగుతోంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న జగ్గారెడ్డి.. ఈ విషయంలో నిజంగానే సైలెంట్ అయ్యారా లేక మళ్లీ సమయం కోసం ఎదురుచూస్తున్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం జగ్గారెడ్డి ఆయనను టార్గెట్ చేస్తుంటారనే టాక్ కూడా ఉంది.
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)
కాబట్టి రేవంత్ రెడ్డి మరోసారి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే జగ్గారెడ్డి మళ్లీ ఆయనను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జగ్గారెడ్డి ఎప్పుడూ ఏ విధంగా స్పందిస్తారన్నది ఎవరికీ తెలియడం లేదని.. కాబట్టి ఈ ఆయన విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తాను కేవలం సంగారెడ్డికి మాత్రమే పరిమితమవుతానని జగ్గారెడ్డి చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు.
చెప్పినట్టుగానే ఆయన కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నారు. అయితే ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి.. మళ్లీ ఎప్పుడు రేవంత్ రెడ్డి అండ్ టీమ్ మీద విమర్శలు చేసేది తెలియదని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి సైలెంట్ అయ్యారా లేక సమయం కోసం వేచి చూస్తున్నారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.