Home /News /politics /

IS CONGRESS HIGH COMMAND GIVEN STRICT ORDER TO TELANGANA CONGRESS MLA JAGGA REDDY AK

Telangana Congress: జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఆ రకమైన ఆదేశాలు ఇచ్చిందా..? అందుకే మౌనంగా ఉన్నారా ?

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana Politics: సంక్రాంతి తరువాత కూడా జగ్గారెడ్డి సైలెంట్‌గా ఉండటం కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

    రాజకీయాల్లో కాంగ్రెస్ రాజకీయాలు వేరు. మిగతా పార్టీల్లోని నేతలు తమ రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం చేసేందుకు వ్యూహాలు రచిస్తే.. కాంగ్రెస్‌లోని నేతలు మాత్రం ముందుగా తమ సొంత పార్టీలోని నేతలపై ఏ రకంగా పైచేయి సాధించాలనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కాంగ్రెస్‌లో ఈ రకమైన రాజకీయాలు కొత్తేమీ కాదు. ఈ రకమైన రాజకీయాల్లోనే నెగ్గితేనే.. కాంగ్రెస్‌లో రాణించడం సాధ్యమవుతుందని వైఎస్ఆర్ వంటి నేతలు నిరూపించారు. తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఈ రకమైన రాజకీయ పరిస్థితులనే ఎదుర్కొంటున్నారనే విషయం అందరికీ తెలుసు. అధికార టీఆర్ఎస్, రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీతో పోరాటం చేయాల్సిన రేవంత్ రెడ్డికి.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తూ జగ్గారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

    ఒకదశలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ జగ్గారెడ్డి కూల్ అయ్యారు. సంక్రాంతి తరువాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి పరిస్థితులు వివరిస్తానని.. అప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకుండా కీలక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే సంక్రాంతి తరువాత కూడా జగ్గారెడ్డి సైలెంట్‌గా ఉండటం కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే ఆయనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    రచ్చకెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని.. తమకు అన్ని విషయాలు తెలుసని కాంగ్రెస్ నాయకత్వం జగ్గారెడ్డికి తేల్చి చెప్పిందని సమాచారం. అందుకే కొద్దిరోజుల క్రితం పార్టీలో రచ్చ రచ్చ చేసిన జగ్గారెడ్డి.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డికి చెక్ చెప్పే విషయంలో జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉండి.. మళ్లీ టైమ్ చూసుకుని రేవంత్ రెడ్డిని ఇరుకునపెట్టేందుకు జగ్గారెడ్డి ప్రయత్నాలు చేయొచ్చనే వార్తలు కూడా కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. పూర్తి వివరాలు

    ఆ సీట్లపై కన్నేసిన Telangana Bjp.. 2 నెలలు పాదయాత్ర.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

    అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతున్న వేళ.. రాష్ట్ర కాంగ్రెస్‌పై హైకమాండ్ ఫోకస్ చేయకపోతే.. ఇలాంటి రచ్చలు మళ్లీ మళ్లీ తెరపైకి రావడం ఖాయమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పదే పదే కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన వివాదాలు వస్తే.. ఆ తరువాత రాష్ట్రంలో ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ పని మరింత సులువు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి తరువాత ఢిల్లీ వెళతానన్న జగ్గారెడ్డి... చెప్పినట్టు చేస్తారా లేక సైలెంట్‌గా ఉండిపోతారా అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Jagga Reddy, Revanth Reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు