CM KCR Strategy: రూటు మార్చిన కేసీఆర్.. టీఆర్ఎస్‌లో కొత్త చర్చ.. అసలేం జరుగుతోంది ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: ప్రస్తుతం కేసీఆర్ దూకుడు చూస్తున్న వాళ్లు సైతం.. ఆయన మరోసారి అలాంటి ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నారేమో అని చర్చించుకుంటున్నారు.

  • Share this:
    తెలంగాణ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. గతంలో ఎక్కువగా సమీక్షలకే ఎక్కువగా పరిమితమైన తెలంగాణ ముఖ్యమంత్రి.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో నేతల చేరికలు ఎక్కువగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే ఎక్కువగా జరిగేవి. కానీ హుజూరాబాద్ ఎపిసోడ్ తరువాత సీన్ మారింది. ఎల్. రమణ, పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి వంటి వాళ్లు స్వయంగా కేసీఆర్ సమక్షంలోనే టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు నేతలతో మాట్లాడేందుకు కూడా సీఎం కేసీఆర్ సమయం ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

    అయితే సీఎం కేసీఆర్ ఒక్కసారిగా ఇంత యాక్టివ్ కావడం వెనుక అసలు కారణం ఏంటనే చర్చ మొదలైంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసమే సీఎం కేసీఆర్ రూటు మార్చారని.. అందుకే ఈ రకంగా మారిపోయారని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో తన వర్కింగ్ స్టయిల్ మార్చుకోవడానికి కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక్కటే కారణం కాకపోవచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

    కేసీఆర్ మదిలో మరేదో రాజకీయ వ్యూహం దాగి ఉండొచ్చనే చర్చ కూడా సాగుతోంది. గతంలో ఎవరూ ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందకు సాగారు. అందులో ఘన విజయం సాధించి తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన దూకుడు చూస్తుంటే.. మరోసారి అలాంటి ఆలోచన ఏదైనా చేస్తున్నారేమో అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారని గతంలో ఆరోపించారు. ప్రస్తుతం కేసీఆర్ దూకుడు చూస్తున్న వాళ్లు సైతం.. ఆయన మరోసారి అలాంటి ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నారేమో అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి పొలిటికల్‌గా ఫుల్ యాక్టివ్ అయిపోయిన గులాబీ బాస్.. మరోసారి ఎవరూ ఊహించని వ్యూహాన్ని అమలు చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published: