Home /News /politics /

IS BJP NOT TAKING TELANGANA CM KCR MEETING WITH OTHER STATE LEADERS TO TARGET THEM AK

KCR-BJP: కేసీఆర్‌తో ఆ నేతల భేటీని బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం లేదా ?

అమిత్ షా, కేసీఆర్ (పైల్ ఫోటో)

అమిత్ షా, కేసీఆర్ (పైల్ ఫోటో)

Telangana News: ఒకవేళ కేసీఆర్ కాంగ్రెస్‌తో కలిసి కేంద్రంలో జతకడితే.. తెలంగాణలో ఈ రెండు పార్టీలు ఒక్కటే అని తేలిపోతుందని.. అప్పుడు రాష్ట్రంలో ఈ రెండు పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుందనే అంచనాలు కమలనాథుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో రాజకీయాలు ఎటు నుంచి ఎటు వెళుతున్నాయనే దానిపై ఎవరికీ పెద్దగా క్లారిటీ రావడం లేదు. ఓ వైపు రాష్ట్రంలో తమకు దొరికిన పట్టును మరింతగా పెంచుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి, సీఎం కేసీఆర్ కూడా అంతే స్థాయిలో ఆ పార్టీకి చెక్ చెప్పేందుకు తనదైన వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు పార్టీలో పోటాపోటీగా రాజకీయ కార్యాచరణను సిద్ధం చేసుకుంటుండటంతో.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఇంకెలా ఉంటాయో అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతుండటంతో.. ఆయన మరోసారి ఫెడరల్ ఫ్రంట్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ మొదలైంది. ఇప్పటికే కేరళ సీఎం విజయన్, బీహార్‌కు చెందిన తేజస్వి యాదవ్‌తో కేసీఆర్ చర్చలు జరిపారు.

    మరికొద్ది రోజుల్లోనే పలువురు ఇతర నేతలతోనూ కేసీఆర్ సమాలోచనలు జరుపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో బీజేపీకి చెక్ పెట్టేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలపై ఆ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలను బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీజేపీకి కొన్ని లెక్కలు ఉన్నాయట. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ లేకుండా కూటమి కట్టడం సాధ్యంకాదని.. కాబట్టి కేసీఆర్ చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించే అవకాశం లేదనే భావనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం.

    ఒకవేళ కేసీఆర్ కాంగ్రెస్‌తో కలిసి కేంద్రంలో జతకడితే.. తెలంగాణలో ఈ రెండు పార్టీలు ఒక్కటే అని తేలిపోతుందని.. అప్పుడు రాష్ట్రంలో ఈ రెండు పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుందనే అంచనాలు కమలనాథుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గతంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపయేతర కూటములను ఏర్పాటు చేసేందుకు ఎంతగానో ప్రయత్నించారని.. అప్పుడు సాధ్యంకాని పని ప్రయత్నాలు ఇప్పుడు ఏ రకంగా సాధ్యమవుతాయని బీజేపీ భావిస్తున్నట్టు టాక్.

    బీజేపీని తెలంగాణలో దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ఈ రకమైన కొత్త ప్లాన్ వేశారనే అనుమానాలు కూడా బీజేపీ నేతలకు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో తన పార్టీపై ఉన్న ఒత్తిడిని అధిగమించేందుకే కేసీఆర్ ఈ రకమైన కార్యాచరణను తెరపైకి తీసుకొచ్చారని.. కొద్దిరోజుల్లోనే ఆయన జాతీయ కూటముల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఆగిపోతాయనే యోచనలో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం.

    KCR-Congress: కేసీఆర్ కొత్త ప్రయత్నాలు.. కాంగ్రెస్‌లో మొదలైన టెన్షన్.. అదే జరిగితే..?

    Telangana: కేసీఆర్ అలాంటి పరిస్థితి తీసుకొస్తారా ?.. అదే అజెండాతో ముందుకు వెళతారా ?

    మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ రకమైన వ్యూహాలతో ముందుకు సాగినా.. రాష్ట్రంలో ఆ పార్టీపై జరిగే రాజకీయ పోరాటాన్ని ఏ మాత్రం అపోద్దనే ఉద్దేశ్యంతో బీజేపీ నేతలు ఉన్నారు. అందుకే టీఆర్ఎస్ టార్గెట్‌గా బీజేపీ రాజకీయ పోరాటం రోజురోజుకు తీవ్రమవుతోంది. కేసీఆర్ ఎత్తుగడలను పట్టించుకోకుండా ముందుకు సాగితేనే రాష్ట్రంలో తాము అనుకున్న రాజకీయ ప్రయోజనాలు దక్కుతాయని.. ఆయన కార్యాచరణకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకుంటే.. మరోసారి ఆయన ట్రాప్‌లో పడిపోయే అవకాశం ఉందని బీజేపీ అనుకుంటున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, CM KCR, Telangana, Trs

    తదుపరి వార్తలు