ఏపీలో టార్గెట్ జగన్.. అమిత్ షా అస్త్రం ఇదేనా?

బీజేపీలో కన్నా, పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ మినహా మిగిలిన నేతలంతా వైసీపీపై విమర్శలు చేసేందుకు జంకుతున్నారు.

news18-telugu
Updated: July 20, 2019, 7:54 PM IST
ఏపీలో టార్గెట్ జగన్.. అమిత్ షా అస్త్రం ఇదేనా?
అమిత్ షాతో వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో అధికార వైసీపీలో ఇన్నాళ్లూ పరోక్షంగా అంటకాగిన బీజేపీ ఇకపై ప్రత్యర్ధిగా మారబోతోందా? ఆ మేరకు వైసీపీ ప్రభుత్వాన్ని, నిర్ణయాలను టార్గెట్ చేయాలని అధిష్టానం నుంచి కాషాయ నేతలకు ఆదేశాలు అందాయా ? జగన్ సర్కారుపై బీజేపీ సీనియర్లు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి విమర్శల దాడి వెనుక కారణమిదేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ స్ధానాన్ని ఎలాగైనా భర్తీ చేయాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. ఏపీలో రాజకీయంగా బలపడేందుకు ఇదే తగిన సమయం అని భావిస్తున్న బీజేపీ నేతలు … అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోరాదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార వైసీపీని టార్గెట్ చేయడం ద్వారా టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. ఆ దిశగా సున్నితమైన అంశాలను సైతం తెరపైకి తెస్తోంది. ముఖ్యంగా మతపరమైన అంశాలను తెరపైకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో వాటిపై తీవ్ర చర్చ జరిగేలా కాషాయ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. సంప్రదాయ రాజకీయ నాయకురాలిగా పేరున్న బీజేపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి మతపరమైన అంశాలను తెరపైకి తీసుకురావడాన్ని బట్టి చూస్తే బీజేపీ భవిష్యత్ రాజకీయం సామాన్యులకు సైతం సులువుగానే అర్ధమవుతోంది.

tdp,bjp,bjp vs tdp,ycp,shock to tdp as senior bjp leader joins ycp,tdp bjp alliance,tdp & bjp,bjp leader kanna,bjp & ycp comments on tdp,tdp vs bjp,kanna laxminarayana on ycp bjp alliance,ycp bjp alliance,kanna laxminarayana about ycp bjp alliance,kanna laxminarayana,kanna lakshminarayana,kanna lakshmi narayana,why tdp links bjp,tdp leaders join bjp,kanna lakshminarayana bjp,కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ, వైసీపీ,టీడీపీ,ఎమ్మెల్యేలు, ఫిరాయింపులు,పిరాయింపులు,
కన్నా లక్ష్మీనారాయణ


వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని భావిస్తున్న సినీ నటుడు అలీని టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమిస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో ఈ మధ్య విపరీతంగా సాగింది. అలాగే విశాఖలో ఓ చర్చిపై దాడులు జరగొచ్చన్న సమాచారంతో భద్రత పెంచారు. ఈ రెండు అంశాలను పురందేశ్వరి ఈ మధ్య ఎక్కడికెళ్లినా ప్రస్తావిస్తున్నారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పురందేశ్వరికి గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారన్న పేరుంది. కానీ అమె లాంటి వారు సైతం ఫక్తు ఆరెస్సెస్ నేపథ్యమున్న వారి తరహాలో మతపరమైన అంశాలను తెరపైకి తీసుకొస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని బట్టి చూస్తే కాషాయ రాజకీయం ఎలా ఉండబోతుందో సంకేతాలు అందుతున్నట్లే అనిపిస్తోంది.

Daggubati Purandeswari, Purandeswari to join YSRCP, Purandeswari Son, వైసీపీలోకి పురందేశ్వరి, వైసీపీలో చేరనున్న దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి కొడుకు పేరు,
ఫురంధేశ్వరి(ఫైల్ ఫోటో)
పురందేశ్వరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సైతం ఈ మధ్య వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్నీ విమర్శిస్తున్నారు. అదీ శాసనసభలో కాస్తో కూస్తో బలమున్న టీడీపీకి మించి ప్రతీ అంశాన్ని రాజకీయంగా విమర్శించేందుకు కన్నా ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ స్ధానాన్ని తాము వేగంగా ఆశిస్తున్నట్లు ఆయన చెప్పకనే చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 2022లో జమిలి ఎన్నికలు జరగొచ్టన్న సంకేతాల నేపథ్యంలో కన్నా దూకుడు చూస్తుంటే భవిష్యత్తుపై సీరియస్ గానే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో టీడీపీ నుంచి మూడింట రెండోవంతు ఎమ్మెల్యేలు బీజేపీకి మారుతారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు సైతం కాషాయం వైపు చూస్తున్నారని నిన్న ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. అదే జరిగితే టీడీఎల్పీ సైతం బీజేఎల్పీలో విలీనం అయినట్లే. ఇందుకోసం బీజేపీ నేతలు ఇప్పటి నుంచే రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అమిత్ షాతో జగన్ చర్చలు


బీజేపీలో కన్నా, పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ మినహా మిగిలిన నేతలంతా వైసీపీపై విమర్శలు చేసేందుకు జంకుతున్నారు. ఓసారి ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న భయం వారిలో కనిపిస్తోంది. అయితే ఇప్పటికి మౌనంగా ఉన్నా... రాబోయే రోజుల్లో వీరంతా తమ సీనియర్లను అనుసరించడం ఖాయంగా తెలుస్తోంది.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>