news18-telugu
Updated: November 26, 2020, 5:42 PM IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(ఫైల్ పొటో)
తిరుపతి ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఓ సారి తిరుపతి ఎంపీ సీటును గెలుచుకున్న కమలనాథులు మరోసారి వెంకన్న సన్నిధిలో కమలం జెండా ఎగరేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి భారీ వ్యూహాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలను బేరీజు వేసుకుని ఓ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు తిరుపతి ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని కూడా దాదాపు ఖాయం చేసినట్టు పార్టీలోని అంతర్గత సమాచారం. గుంటూరు జిల్లా నుంచి గతంలో టీడీపీ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత జనసేన పార్టీలో చేరిన ఆ నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆ దళిత నేత పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తిరుపతి లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అక్కడ కొంచెం పేరున్న దళిత నేతను బరిలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. తాను బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఆ నేత పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, వారు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన పేరునే దాదాపు ఫైనల్ చేసే చాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు.
సుప్రీంకోర్టులో జగన్‌కు డబుల్ బొనాంజా.. మరో గుడ్ న్యూస్కేటీఆర్‌కు ‘దొరికిపోయిన’ బీజేపీ.. బండి సంజయ్‌పై బీభత్సంగా ట్రోలింగ్
తిరుపతి ఉప ఎన్నికల టికెట్ తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసి.. కమలానికి జై కొట్టారు. పార్టీ దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. జనసైనికులు బీజేపీకి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుపతి సీటు తమకు ఇవ్వాలని కోరుతున్నందునే పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీలో బీజేపీకి జై కొట్టినట్టు చెబుతున్నారు. అయితే, గతంలో ఓ సారి అక్కడ గెలిచిన తాము మరే పార్టీకి ఇవ్వబోమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో బీజేపీ పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇవ్వనున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ
Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు తిరుపతి ఉప ఎన్నికకు ఎప్పుడైనా షెడ్యూల్ రావొచ్చనే అనుమానంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి పేరు ఖాయమైంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఏపీ మొత్తం పాదయాత్ర చేసిన సమయంలో గురుమూర్తి ఆయనకు వైద్య సేవలు అందించారు. ఇక టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
3 నిమిషాల్లో 30 మ్యాజిక్స్... చూస్త్రే థ్రిల్ అయిపోతారు.. అందుకే గిన్నిస్ రికార్డు
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున బల్లి దుర్గా ప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. కానీ, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరోనా వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చనిపోయారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి దుర్గా ప్రసాద్ 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 1985, 1994, 1999, 2009లో నాలుగుసార్లు గూడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి 2.28 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 26, 2020, 5:09 PM IST