జగన్ వ్యూహం.. ఎన్టీఆర్ అల్లుడికి చెక్.. దారి చూసుకోవాల్సిందేనా?

దగ్గుబాటిని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేసిన వ్యక్తిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం అంటే పరోక్షంగా వదిలించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

news18-telugu
Updated: October 4, 2019, 7:47 PM IST
జగన్ వ్యూహం.. ఎన్టీఆర్ అల్లుడికి చెక్.. దారి చూసుకోవాల్సిందేనా?
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం
  • Share this:
రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌గా గుర్తింపు పొందిన నేతను పొమ్మనకుండా పొగబెట్టేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఎవరో కాదు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుంచి తన కొడుకు హితేష్ చెంచురాను బరిలో దించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. అయితే, హితేష్ అమెరికా పౌరసత్వానికి సంబంధించిన సమస్య రావడంతో స్వయంగా వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచిన రికార్డు ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. జగన్ ప్రభంజనంలో కూడా ఓడిపోవడం విశేషం. ఎన్నికల్లో తన ఓటమి తర్వాత కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు బయట పెద్దగా కనిపించలేదు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ మాత్రం మూడు నెలల్లోనే భారీ ఎత్తున చరిత్రాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను, ప్రజలకు చేరవేయడంలో ఎవరెవరు ఎంతమేర సఫలీకృతం అవుతున్నారు? ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారనే అంశంపై వైసీపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పర్చూరుకు సంబంధించిన చర్చ కూడా వచ్చినట్టు తెలిసింది.

ys jagan, ysrcDaggubati Purandeswari, Purandeswari to join YSRCP, Purandeswari Son, వైసీపీలోకి పురందేశ్వరి, వైసీపీలో చేరనున్న దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి కొడుకు పేరు,p, ys jagan lotus pond, daggubati venkateshwar rao with ys jagan, daggubati met ys jagan, daggubati purandareshwari, bjp daggubati purandareshwari, వైఎస్ జగన్, వైఎస్ఆర్‌సీపీ, వైఎస్ జగన్ లోటస్ పాండ్, వైఎస్ జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు , వైఎస్ జగన్‌ను కలిసిన దగ్గుబాటి, దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, దగ్గుబాటి హితేష్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ చెంచురాం (File)


తన పని తాను చేసుకుపోయే వ్యక్తిగా పేరున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలేవీ నిర్వహిచడం లేదని, కనీసం పార్టీ కండువా కూడా కప్పుకోలేదంటూ నియోజకవర్గానికి చెందిన కొందరు కిందిస్థాయి నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల మీద ఆమె బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు భర్త పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, మరోవైపు భార్య మరో పార్టీలో ఉంటూ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుండడంతో దగ్గుబాటి మీద వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉంది.

ys jagan, ysrcp, ys jagan lotus pond, daggubati venkateshwar rao with ys jagan, daggubati met ys jagan, daggubati purandareshwari, bjp daggubati purandareshwari, వైఎస్ జగన్, వైఎస్ఆర్‌సీపీ, వైఎస్ జగన్ లోటస్ పాండ్, వైఎస్ జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు , వైఎస్ జగన్‌ను కలిసిన దగ్గుబాటి, దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, దగ్గుబాటి హితేష్
దగ్గుబాటి దంపతులు, వైఎస్ జగన్ ఫైల్




ఈ క్రమంలో దగ్గుబాటిని పార్టీ నుంచి పొమ్మనకుండా పొగపెట్టడానికి ఓ ప్లాన్ వేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు టికెట్ ఆశించి భంగపడిన రావి రామనాధంబాబును మళ్లీ వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయనకు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. ఎన్నికల సమయంలో దగ్గుబాటి ఓటమికి బలంగా ప్రయత్నించారు. దగ్గుబాటిని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేసిన వ్యక్తిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం అంటే పరోక్షంగా వదిలించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>