సేమ్ టు సేమ్ బాబుకి జరిగినట్టే జగన్‌కూ జరుగుతోందా...

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే.. జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారా? అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: July 27, 2019, 10:04 PM IST
సేమ్ టు సేమ్ బాబుకి జరిగినట్టే జగన్‌కూ జరుగుతోందా...
సీఎం జగన్, చంద్రబాబు (File)
  • Share this:
చంద్రబాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నారా? ఈ వాక్యం చదవగానే.. సహజంగా అందరికీ వచ్చే సందేహం ఒక్కటే. అసలు చంద్రబాబు చేసిన తప్పేంటి? జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న తప్పేంటి? అనే సందేహం వస్తుంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలను చూస్తే.. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు.. సీఎంను పొగడ్తల్లో ముంచెత్తేవారు. ధీరుడు, సూరుడు అంటూ ఆకాశానికి ఎత్తేసేవారు. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. చంద్రబాబునాయుడు కూడా సీఎం సీటులో కూర్చుని ఆ పొగడ్తలను బాగా ఆస్వాదించేవారు. తన చుట్టూ ఉన్నవారు, కోటరీ చెబుతున్న మాటలను, వారి భజన చూసి నమ్మేసిన చంద్రబాబు.. ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని గ్రహించలేకపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 35 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీడీపీ ఓడిపోయింది.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే.. జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారా? అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని సంచలన, చరిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే, వాటి ఫలితాలు ఎలా ఉంటాయనేది భవిష్యత్తులో తేలుతుంది. బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో, వాటిపైచర్చ సందర్భంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ మోహన్ రెడ్డిని సాక్షాత్తూ దేవుడు అంటూ కీర్తించారు. జగన్ కూడా వారి భజనకు ఉప్పొంగిపోతున్నారు. అయితే, ఇచ్చిన మాట ప్రకారం బిల్లులు తేవడమే కాకుండా, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశాలను జగన్ మోహన్ రెడ్డి గుర్తించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిందే నిజమని భావించకుండా, ప్రజలు ఏమనుకుంటున్నారనే అభిప్రాయాన్ని తెలుసుకుంటే బావుంటుందని చెబుతున్నారు.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు