• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • IS ANDHRA GOVT PLANNING TO APPROACH NIA OVER AB VENKATESWARA RAO CASE BA

సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావుపై దేశద్రోహం ఆరోపణ... కేంద్ర సంస్థతో దర్యాప్తు?

సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావుపై దేశద్రోహం ఆరోపణ... కేంద్ర సంస్థతో దర్యాప్తు?

జగన్, ఏబీ వెంకటేశ్వరరావు(ఫైల్ ఫోటో)

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే NIA లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి అప్పగించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే NIA లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి అప్పగించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ దేశద్రోహం ఆరోపణలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారని ప్రభుత్వం ఆరోపణ పత్రంలో తెలిపింది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరపాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించే ఆలోచనలో ఉంది. అదే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వరరావు మీద 7 అభియోగాలు ఉన్నాయి.

    వెంకటేశ్వరరావు రాజద్రోహానికి పాల్పడినట్టు ఆరోపణ


    ఏపీ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ వేటుపై ఏబీ వెంకటేశ్వర్రావు స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమి లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. బంధుమిత్రులను ఉద్దేశించి వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు.  అక్రమాల కారణంగా నాపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్ట పరంగా ముందుకు వెళ్తాన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది క్రమంగా అందరికీ తెలుస్తుందన్నారు.దీనిపై ఆయన ఓ లేఖ కూడా విడుదల చేశారు.

    ఏబీ వెంకటేశ్వరరావు లేఖ


    వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు ప్రభుత్వం చెప్పిన కారణాలు..


    • నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు

    • ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు

    • ఇజ్రాయెల్ సంస్ధ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో కుమ్మక్కై కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ

    • విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొన్న ప్రభుత్వం

    • విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ

    • నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ

    • రాష్ఠ్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణ

    • కాసులకు కక్కుర్తి పడి అనామక సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణ

    • కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని ఆరోపణ

    • విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని ఆరోపణ

    • ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని ఆరోపణ

    • నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపణ

    • ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని ఆరోపణ

    • కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారని ఆరోపణ

    • వెంకటేశ్వరరావు కుమారుడికి చెందిన కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా ఇజ్రాయెల్ కంపెనీతో రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది.


    Published by:Ashok Kumar Bonepalli
    First published: