Home /News /politics /

IS AMARAVATI IS THE CAPITAL OF ANDHRA PRADESH MINISTER BOTSA SATYANARAYANA RESPONDS AK

Amaravati: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనా ?.. ఏపీ మంత్రి బొత్స ఏం చెప్పారంటే..

అమరావతి, బొత్స సత్యానారాయణ

అమరావతి, బొత్స సత్యానారాయణ

అమరావతిని అభివృద్ధి చేయాలనే ఆలోచన తమకు కూడా ఉందని స్పష్టం చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు.. కనీసం కరకట్టుకు సరైన రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు.

    ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లును వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో ప్రకటన కూడా చేసింది. త్వరలోనే మరింత సమగ్రంగా, సవివరంగా మరో బిల్లును తీసుకొస్తామని సీఎం జగన్(YS Jagan) ప్రకటించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రంలో మరింత కన్ఫ్యూజన్ మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతానికి ఏపీ రాజధాని ఏదీ అనే చర్చ మరోసారి మొదలైంది. ఇదే అంశంపై ఏపీ పురపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్పందించారు. అసెంబ్లీ ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బొత్స.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీసుకున్న ఏపీ రాజధాని అమరావతేనా అనే ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేదు. అమరావతి (Amaravati)  అనేది కేంద్రం ప్రచురించిన జియోలాజికల్ సర్వేలో కూడా లేదని వ్యాఖ్యానించారు.

    ఏపీ రాజధాని ఏదీ అనేది త్వరలోనే చెబుతామని వ్యాఖ్యానించారు. అసలు పదేళ్లపాటు హైదరాబాద్ ఏపీకి ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఎందుకు తిరిగొచ్చారని ఆయన ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించాలనే ఉద్దేశ్యంతోనే ఏపీ సీఎం జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలనే ఆలోచన తమకు కూడా ఉందని స్పష్టం చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు.. కనీసం కరకట్టుకు సరైన రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. తాము ఇక్కడ రాజధానిని తీసేయలేదని గుర్తు చేశారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలన్న బీజేపీ వాదనను మంత్రి బొత్స తప్పుబట్టారు. రాజ్యాంగంలో ఇదే రాజధాని అని ఎక్కడైనా ఉందా ? అని ప్రశ్నించారు. అసలు బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎలాంటి స్టేక్ లేదని వ్యాఖ్యానించారు. బాధ్యత లేని వాళ్లు ఏదైనా మాట్లాడతారని.. కానీ బాధ్యత ఉన్న తాము అలా మాట్లాడలేమని అన్నారు.

    AP Capital Issue: మూడు రాజధానులపై తాత్కాలికంగా వెనక్కి తగ్గిన సీఎం జగన్.. మళ్లీ కొత్త బిల్లు వచ్చేది ఎప్పుడు.. నెక్ట్స్ ఏంటి ?

    Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

    ఈ అంశంపై ఆందోళన చేస్తున్న అమరావతి రైతులతో చర్చిస్తారా ? అన్న ప్రశ్నకు బొత్స సమాధానం ఇచ్చారు. వారికి గత ప్రభుత్వం ఇస్తామన్నవి అన్నీ ఇస్తున్నామని.. కానీ అన్నీ తాము అనుకున్నట్టు, కోరుకున్నట్టు జరగాలంటే కుదరదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల విషయంలో తాము వెనక్కి తగ్గలేదని.. పలువురికి ఉన్న అపోహలు, సందేహాలు తొలగించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని మంత్రి బొత్స ఆరోపించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amaravati, Andhra Pradesh, Botsa satyanarayana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు