IRREGULARITIES IN VOTERS LIST HYDERABAD HIGH COURT ADJOURNED THE PETITION TO 10TH OCTOBER
‘ఓటర్ల జాబితా’పై విచారణ 10కి వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్ హైకోర్టు
మొదట పిటిషనర్ల తరఫు వాదనలను విన్నారు. అనంతరం ఈసీ దాఖలు చేసిన కౌంటర్‌ను స్వీకరించారు. ఈ రెండింటినీ పరిశీలించడానికి సమయం కావాలి కాబట్టి.. ఈనెల 10వ తేదీకి విచారణను వాయిదా వేశారు.
తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది హైదరాబాద్ హైకోర్టు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్.. న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. టెక్నాలజీ సాయంతో 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని హైకోర్టులో వివరణ ఇచ్చింది. దీంతో ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై విచారణ పిటిషన్‌ను పదో తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
ఓటర్ల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డితోపాటు మరో ఇద్దరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొత్తం 14 అభ్యంతరాలను వారు లేవనెత్తారు. ఏపీలో కలిపిన ఏడు మండలాలకు చెందిన ఓటర్ల పరిస్థితి ఏంటి? 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండివారికే ఓటు హక్కు కల్పించడం వల్ల సుమారు 20 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని చెబుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ల అభ్యంతరాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని, వారి అనుమానాలు నివృత్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీనికి సంబంధించి ఇవాళ ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఉదయం కోర్టు ప్రారంభమైన వెంటనే మొదట పిటిషనర్ల తరఫు వాదనలను విన్నారు. అనంతరం ఈసీ దాఖలు చేసిన కౌంటర్‌ను స్వీకరించారు. ఈ రెండింటినీ పరిశీలించడానికి సమయం కావాలి కాబట్టి.. ఈనెల 10వ తేదీకి విచారణను వాయిదా వేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.