టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఏబీ వెంకటేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్...

‘మీరు మీరు పార్లమెంట్ లో కలసి మెలసే ఉంటారుగా! అందరూ కలసి ఒక అభిప్రాయానికి రండి’ అని ఏబీ వెంకటేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: February 9, 2020, 10:19 PM IST
టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఏబీ వెంకటేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్...
కేశినేని నాని, ఏబీ వెంకటేశ్వరరావు (File)
  • Share this:
విజయవాడ లోక్‌సభ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నానికి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయన భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, అధికార దుర్వినియోగం చేశారని, తన కొడుకుకు అయాచిత లబ్ధి చేకూర్చేందుకు రాజద్రోహానికి పాల్పడ్డారంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆయన విజయవాడ దాటి వెళ్లొద్దని ఆదేశించింది. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘మీరు (వైఎస్ జగన్ ) ముఖ్యమంత్రి అవ్వటానికి, మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని (ఏబీ వెంకటేశ్వరరావు) సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.



అయితే, ఆ ట్వీట్‌కు ఏబీ వెంకటేశ్వరరావు కౌంటర్ ఇస్తూ రెండు ట్వీట్లు చేశారు. మొదటి ట్వీట్‌లో ‘ఏమిటోనండీ ఎంపీ గారూ! మీరేమో ఇలా అంటారు. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు.’ అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత రెండో ట్వీట్‌లో ఎంపీ కేశినేని నానితో పాటు టీడీపీ, వైసీపీ ఎంపీల మీద సెటైర్ వేశారు. ‘మీరు మీరు పార్లమెంట్ లో కలసి మెలసే ఉంటారుగా! అందరూ కలసి ఒక అభిప్రాయానికి రండి - నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేసానో. నాక్కూడా కొంచెం క్లారిటీ వస్తుంది.’ అని ఏబీ వెంకటేశ్వరరావు మరో ట్వీట్ చేశారు.



మరోవైపు మాజీ సీఎం చంద్రబాబునాయుడు మాత్రం ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఉద్యోగుల మీదే ఫ్యాక్షనిజం పంజా విసిరిందంటూ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ ఫాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోంది. ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదు. రైతులు, రైతుకూలీలు, మహిళలు, యువత, కార్మికులు అన్నివర్గాల ప్రజలను అష్టకష్టాలు పెట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫాక్షనిస్ట్ పంజా విసరింది. 3 నెలలకు మించి వెయిటింగ్ లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించమంటూ ఉత్తర్వులు ఇవ్వడం, 6నెలల కన్నా ఒక్కరోజు వెయిటింగ్ లో ఉన్నా అసాధారణ సెలవుగా పరిగణిస్తామని అనడం వైసిపి కక్ష సాధింపునకు పరాకాష్ట. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలనే ఈ ఉన్మాద చర్యలను ఖండిస్తున్నాం.’ అని చంద్రబాబునాయుడు అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 9, 2020, 10:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading