IPL EX BOSS LALIT MODI SLAMS RAHUL GANDHI ON ALL MODIS CRIMINAL MK
రాహుల్పై లండన్ కోర్టులో కేసు వేస్తానంటున్న మరో మోదీ...
రాహుల్ గాంధీ
మోదీ అని ఇంటిపేరున్న వారంతా దొంగలేనని రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనిపై ఐపీఎల్ అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ స్పందించడం విశేషం. రాహుల్ గాంధీపై వీలైతే బ్రిటన్ కోర్టును ఆశ్రయిస్తానని ట్వీట్ చేశారు.
దొంగలందరి పేరులో మోదీ అని ఎందుకు ఉంది...కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దేశవ్యాప్తంగా మోదీ ఇంటిపేరు కలిగిన వారు లక్షల సంఖ్యలో ఉంటారని, వారందరిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఐపీఎల్ అవినీతిలో దేశం విడిచిపోయిన లలిత్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ...వీలైతే బ్రిటన్ కోర్టును ఆశ్రయించి రాహుల్ పై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. అంతేకాదు గడిచిన 50 సంవత్సరాలుగా దేశాన్ని దోచుకున్నది...గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యులేనని లలిత్ మోదీ ట్విట్టర్ లో స్పందించారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ... దొంగలందరి పేరులో మోదీ అని ఎందుకు ఉంది అంటూ వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. ముఖ్యంగా లలిత్ మోదీ, రాఫెల్ ఒప్పందంలోని అవకతవకలను ఉద్దేశిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తనను కూడా బాధించాయని బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ కూడా అన్నారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించగా, సోమవారం కోర్టు ఈ అంశాన్ని విచారించనుంది. కాగా ప్రధాని మోదీ సైతం రాహుల్ వ్యాఖ్యలను ఖండించడం విశేషం.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.