హోమ్ /వార్తలు /రాజకీయం /

ట్రాక్టర్‌పై సోఫానా? రాహుల్ గాంధీ రైతు యాత్రపై జోకులే జోకులు

ట్రాక్టర్‌పై సోఫానా? రాహుల్ గాంధీ రైతు యాత్రపై జోకులే జోకులు

రాహుల్ గాంధీ ర్యాలీపై సోషల్ మీడియాలో మీమ్స్

రాహుల్ గాంధీ ర్యాలీపై సోషల్ మీడియాలో మీమ్స్

రాహుల్ గాంధీ ట్రాక్టర్ యాత్రపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. కుప్పలు తెప్పలుగా మీమ్స్ పుట్టుకొచ్చాయి. చాలా మంది నెటిజన్లు మిస్టర్ బీన్‌తో రాహుల్‌ను పోల్చుతూ ఫొటో ట్వీట్ చేశారు.

  కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఉత్తరాదిన పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయచట్టాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌లో ఆదివారం ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఖేతి బచావో యాత్ర (పంటల పరిరక్షణ యాత్ర) పేరుతో అక్టోబరు 4 నుంచి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పలు జిల్లాలు, పలు నియోజవర్గాల మీదుగా 50 కి.మీ. మేర యాత్ర సాగనుంది. ఆదివారం మోగా పట్టణంలో ర్యాలీని ప్రారంభించిన రాహుల్ గాంధీ ట్రాక్టర్‌పై ప్రయాణించారు.

  ఐతే ర్యాలీలో రాహుల్‌ గాంధీ కూర్చున్న ట్రాక్టర్‌పై కుషన్‌ సోఫా లాంటిది ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్‌పై సోఫానా? అంటూ రాహుల్‌పై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. సోఫా లేకుండా కాసేపు కూడా ట్రాక్టర్‌పై కూర్చోలేకపోయారు.. రైతు కష్టం గురించి మీకేం తెలుసని ఎద్దేవా చేస్తున్నారు. అసలు ఇది నిరసన కార్యక్రమం కాదని.. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు.

  కాంగ్రెస్‌ ప్రారంభించిన నిరసన రాజకీయ ఆందోళనే. నూతన వ్యవసాయ చట్టంతో కొందరి స్వార్థ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. వారే ఈ నిరసన చేస్తున్నారు. ఇలా ట్రాక్టర్లపై సోఫాలు వేసుకోవడం నిరసన అనిపించుకోదు. ఇది రైతులను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ఆందోళన పర్యాటకం అని ట్వీట్ చేశారు హర్దీప్ సింగ్ పూరి.


  ఇక రాహుల్ గాంధీ ట్రాక్టర్ యాత్రపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. కుప్పలు తెప్పలుగా మీమ్స్ పుట్టుకొచ్చాయి. చాలా మంది నెటిజన్లు మిస్టర్ బీన్‌తో రాహుల్‌ను పోల్చుతూ ఫొటో ట్వీట్ చేశారు.  ఈయన ఖచ్చితంగా బీజేపీకి ప్రచారం చేస్తున్నారు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


  అక్టోబరు 6న హర్యానాలోనూ ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. 6, 7 తేదీల్లో హర్యానాలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలు జరుగుతాయి. పంజాబ్ సరిహద్దులోని పెహోవా ప్రాంతంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారు. అనంతరం జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, Farmers Protest, Punjab, Rahul Gandhi

  ఉత్తమ కథలు