Contempt of Court: ధిక్కరణ కేసులో సంచలన తీర్పు.. మాజీ అధ్యక్షుడికి 15నెలల జైలు శిక్ష

మాజీ అధ్యక్షుడికి 15 నెలల జైలు శిక్ష

చట్టం ముందు ఎవరైనా సమానమనే తీర్పు ఒకటి వెలువడింది. నేరుగా ఒక దేశ మాజీ అధ్యక్షుడికే 15 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు.. ఇంతకీ ఎందుకో తెలుసా..?

  • Share this:
    కోర్టు ఆదేశాలను దిక్కరిస్తే ఎవరికైనా శిక్షలు తప్పవని మరోసారి రుజువు అయ్యింది. ఒకప్పుడు దేశానికి అద్యక్షుడైనా అయినా కోర్టులు చెప్పిన ఆదేశాలను పాటించని కారణంగా 15 నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు 79 ఏళ్ల జాకబ్‌ జుమాకు ఆదేశ అత్యున్నత న్యాయస్థానం 15నెలల జైలు శిక్షను విధించింది. జుమా పదవీ కాలంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జరుగుతన్న విచారణకు హాజరవ్వాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కారం కింద ఈ శిక్షను విధించింది. 2009–18 కాలంలో జుమా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. తాజాగా కోర్టు ధిక్కార శిక్ష విధింపు సమయంలో సైతం జూమా కోర్టులో లేరు. ఏదైనా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయేందుకు ఆయనకు కోర్టు ఐదురోజుల సమయం ఇచ్చింది. ఈ సమయంలో లొంగుబాటుకు రాకుంటే అరెస్టుకు ఆదేశాలిస్తారు.

    జాకబ్ జుమాకు ఎందుకు అంత పెద్ద శిక్ష పడిందో తెలుసా? దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు ఆ దేశ సుప్రీంకోర్టు మంగళవారం 15 నెలల జైలు శిక్ష విధించింది. ఆయన హయాంలో అవినీతి ఆరోపణలపై జరిపిన విచారణకు హాజరుకాకపోవడం వల్ల.. ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు నిర్దారించి ఈ శిక్ష వేసింది.

    2009 నుంచి 2018 వరకు దాదాపు తొమ్మిదేళ్ల పాటు జాకబ్ జుమా అధికారంలో ఉన్నారు. జుమాపై.. దేశ ఖజానాను దోచుకునేందుకు అవకాశం కల్పించారనే ఆరోపణలున్నాయి. ఈ అంశం గత కొన్ని ఏళ్లుగా కోర్టులో విచారణ సాగుతోంది. అయితే ఆయన కొంత కాలంగా కోర్టుకు రావడం లేదు. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
    Published by:Nagesh Paina
    First published: