Home /News /politics /

kalvakuntla kavitha విషయంలో గేరు మార్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి -Nizamabad trsలో ఇదే చర్చ

kalvakuntla kavitha విషయంలో గేరు మార్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి -Nizamabad trsలో ఇదే చర్చ

నిజామాబాద్ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ క‌విత నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌కు వ‌స్తే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైద‌రాబాద్ లో ఉండేవారు. చాలా కాలంపాటు ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ క‌నిపించింది. కవితకు మంత్రి పదవి రావొచ్చనే ఊహాగాలు కూడా వారి మధ్య ఆధిపత్యపోరుకు కారణం అయి ఉండొచ్చనే చర్చ జరిగింది. అయితే..

ఇంకా చదవండి ...
    (P.Mahender,News18,Nizamabad)
    నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవితకు చాలా ఆదరణ ఉంది. సీఎం కేసీఆర్ తనయ కావడంతో ఎమ్మెల్సీ కవితకు ప్ర‌త్యేక స్థానం ఉంది. అయితే అదే స్థాయిలో జిల్లా అభివృద్దిలో ముందుండి న‌డిపిస్తుంది. అయితే గ‌త కొంత కాలంగా ఎమ్మెల్సీ క‌విత‌తో క‌లిసి ఏలాంటి అభివృద్ది కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఇప్పుడు రూటూ మార్చారు. త‌న నియోజ‌కవ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌ను ఎమ్మేల్సీ క‌విత‌తో క‌లిసి మంత్రి ప్రారంబించ‌డం జిల్లాలో చ‌ర్య‌నీయ ఆంశంగా మారింది.

    సీఎం కేసీఆర్ త‌న‌య‌.. మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఎమ్మెలసీ కల్వ‌కుంట్ల క‌విత‌.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, నిజామాబాద్ ఎంపీగా మచి పేరు సాధించడంతోపాటు, నిజామాబాద్ ప్రజల అభిమాన్ని పొందారు. అయితే 2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓట‌మి చేందిన త‌రువ‌త క‌విత రాజ‌కీయ‌ల‌కు దూరంగా ఉంది. మళ్లీ 2020లో వ‌చ్చిన స్థానిక సంస్థాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో విజయం సాధించి, కవిత జిల్లాలో తిరిగి క్రీయ‌శీలంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ క్రమంలోనే పరిస్థితి మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డికి ఎమ్మేల్సీ క‌విత‌కు మ‌ద్య ఆదిప‌త్య పోరులా మారింది.

    Tinder : వామ్మో! వీడియో డేటింగ్స్‌లో Hyderabad టాప్ -ఫోన్‌లోనే అన్నీ కానిచ్చేస్తున్నారు..


    ఎమ్మెల్సీ క‌విత నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌కు వ‌స్తే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైద‌రాబాద్ లో ఉండేవారు. చాలా కాలంపాటు ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ క‌నిపించింది. మ‌రో వైపు ఎమ్మేల్సీ క‌విత మంత్రి అవుతుంద‌ని అప్పట్లో పుకారు ఉండేది. దీంతో ఎమ్మేల్సీ క‌విత‌కు మంత్రి కి మ‌ద్య ఏదో జ‌రుగుతుంద‌ని పార్టీ శ్రేణులు బ‌హిరంగంగానే చ‌ర్చించుకున్నారు. అయితే కొద్ది రోజుల కిందటే స్థానిక సంస్థాల ఎమ్మెల్సీగా క‌విత ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆ నాటి నుంచి ప‌రిస్థితులు మారిపోయాయి.

    ఏ సంస్థ అయినా ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించకూడదు : రమేష్ తొలగింపు కేసులో హైకోర్టు సంచలన తీర్పు



    మొన్నటిదాకా క‌విత కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న మంత్రి వేముల... ఇప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌కూ ఎమ్మెల్సీని ఆహ్వానిస్తున్నారు. క‌విత‌తో క‌లిసి మంత్రి వేముల ప‌లు అభివృద్ది ప‌నుల్లో పాల్గొంటున్నారు అనే మెసేజ్ రావ‌డంతో జిల్లాలో చ‌ర్య‌నీయం ఆంశంగా మారింది. తాజాగా భీమ్ గల్ మున్సిపాలిటీ ప‌రిదిలో 33 కోట్ల రూపాయ‌ల నిదుల‌తో 21 ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంబోత్స‌వాలు చేసారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత చీప్ గెస్ట్ గా హ‌జ‌ర‌య్యారు. దీంతో మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డికి ఎమ్మేల్సీ క‌విత‌కు మ‌ద్య విబేదాలు తోలిగి పోయాయ‌ని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. ఏది ఏమైన జిల్లాలో ముఖ్య నేత‌లు అయినా కవిత, ప్రశాంత్ రెడ్డిల మధ్య సయోద్య కుద‌ర‌డంతో ఇరు వర్గాలు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండిపోయాయి.
    Published by:Madhu Kota
    First published:

    Tags: Kalvakuntla Kavitha, Minister prashanth reddy, Nizamabad, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు