టీడీపీ నేత నారా లోకేష్ టీడీపీఎల్పీ వైపు వెళ్తుండగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయనకు ఎదురుపడ్డారు. దీంతో ఆర్కేను పలకరించిన లోకేష్.. ఆయనతో కరచాలనం చేసి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ టీడీపీఎల్పీ వైపు వెళ్తుండగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయనకు ఎదురుపడ్డారు. దీంతో ఆర్కేను పలకరించిన లోకేష్.. ఆయనతో కరచాలనం చేసి అభినందనలు తెలిపారు.ప్రతిగా ఆర్కే లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. లోకేష్‌పై ఆర్కే 6200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదిలా ఉంటే, నేడు సభ ప్రారంభం కాగానే ఇటీవల చనిపోయిన ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానం ప్రకటించారు. వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణంపై ఉభయ సభల్లో సంతాప తీర్మానం ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రస్తుతం సభలో చర్చ జరుగుతోంది.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.