హోమ్ /వార్తలు /National రాజకీయం /

JC-Paritala: అనంత రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ఆగర్భ శత్రువుల ఆలింగనం

JC-Paritala: అనంత రాజకీయాల్లో ఆసక్తికర సీన్.. ఆగర్భ శత్రువుల ఆలింగనం

జేసీ, పరిటాల ఆత్మీయ ఆలింగనం

జేసీ, పరిటాల ఆత్మీయ ఆలింగనం

JC Prabhkar Reddy- Parital Sriram: అనంతపురం రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాల మధ్య వైరం ఇప్పటిది కాదు.. ఎప్పునిప్పులా ఉంటాయి ఆ రెండు కుంటుంబాలు. వారి మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గు మంటుంది. గతంలో ఆ ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. కానీ ఎప్పుడు కలిసికట్టుగా కనిపించింది లేదు. అలాంటి నేతలు ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తి కర పరిణామం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

JC Prabhakar Reddy-Paritala Shriram: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అనంతపురం (anantapuram)లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అనంత రాజకీయాల్లో ఆసక్తికరమైన సీన్ కనిపించింది. జిల్లాలో ఒకప్పుడు ఉప్పు-నిప్పులా ఉన్న జేసీ, పరిటాల కుటుంబాలు ఇప్పుడు ఆప్యాయంగా దగ్గరవుతున్నాయి. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ కావడం విశేషం. ఒకప్పుడు జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉండగా, పరిటాల ఫ్యామిలీ ముందు తెలుగుదేశం పార్టీలో ఉంది. వైఎస్ మరణానంతరం రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ముఖ్యమంత్రి అయ్యాక జేసీ కుటుంబం కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం కండువా కప్పుకుంది. ఆ సమయంలో పరిటాల కుటుంబం.. జేసీ ఫ్యామిలీ చేరికను తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి శత్రువైన వైసీపీని దెబ్బతీసేందుకు జేసీ-పరిటాల కుటుంబాలు శత్రుత్వం వదిలి మిత్రులుగా మారాయి. పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్‌ రెడ్డి (JC Prabhakar Redyy) ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. మాట్లాడుకున్నారు. ఈ సీన్ చూసిన రాయలసీమ జనం మురిసిపోతున్నారు. ఆనంద పడుతున్నారు.

తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి నారా లోకేష్ అనంతపురం జిల్లా  పర్యటన సందర్భంగా ఆ సీన్ కనిపించింది. జిల్లా సరిహద్దులో లోకేష్‌కు స్వాగతం పలికేందుకు తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ అక్కడికి చేరుకున్నారు. పరిటాల శ్రీరామ్ అక్కడున్న టీడీపీ నేతల్ని ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకెళ్లారు. ఆ తర్వాత అక్కడే ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు వెళ్లారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కల్మషం లేకుండా సొంత బిడ్డలా శ్రీరామ్‌ను దగ్గరకు తీసుకున్నారు. శ్రీరామ్ కూడా ప్రభాకర్ రెడ్డి పెద్దరికాన్ని గౌరవించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లారు.

ఇదీ చదవండి: మరణంలోనూ వీడని స్నేహబంధం.. పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ.. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల దుర్మరణం

ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. శ్రీరామ్ భుజాలపై చేతులు వేసి కుశల ప్రశ్నలు వేశారు. ఇద్దరూ కలిసి లోకేష్ కోసం కొద్దిసేపు ఎదురు చూశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, శ్రీరామ్ ఆలింగనం చేసుకున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీన్‌ ఇప్పుడు అనంత పాలిటిక్స్‌లో హాట్‌టాఫిగా మారింది..

ఇదీ చదవండి: : టార్గెట్ 2024.. కలుస్తున్న టీడీపీ-జనసేన..! సెట్ చేస్తున్న బీజేపీ సీనియర్…?

ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు దుమ్మురేపుతున్నాయి. అలాగే రాయల సీమలోని అన్ని రాజకీయ వర్గాలు ఖుషీ అవుతున్నారు. పరిటాల, జేసీ ఫ్యామిలీ ఓకే వేదిక మీదకు రావడం వల్ల మంచి మెసేజ్ ఇచ్చారని.. ఇది శుభపరిణామం అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఏదమైన అనంతపురం ప్రజలు మాత్రం మురిసి పోతున్నారు.

ఇదీ చదవండి: : విద్యార్థి సంఘాల ముసుగులో దాడి.. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు వద్దంటూ మంత్రి సరేష్ ఫైర్

మరోవైపు ఈ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ లోని కారు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మకు ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుత్తి హైవే నుంచి అనంతపురం వెళ్లే దారిలో కాసేపల్లె టోల్ గేట్ ప్లాజా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. నారా లోకేష్ వస్తున్నందున తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం బయల్దేరారు. ఇదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Jc prabhakar reddy, Paritala sriram, TDP

ఉత్తమ కథలు