ఇంటర్ మార్కుల్లో అక్రమాలు... బోర్డు ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ఇంటర్ బోర్డు కార్యదర్శి తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదన్నారు. పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్‌గానే సాగిందన్నారు.

news18-telugu
Updated: April 20, 2019, 3:54 PM IST
ఇంటర్ మార్కుల్లో అక్రమాలు... బోర్డు ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థుల ఆందోళన
news18-telugu
Updated: April 20, 2019, 3:54 PM IST
ఇటీవలే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వచ్చాయి. అయితే ఇంటర్ మార్కుల్లో అవకతవకలు జరిగాయని పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్ మెమోలో మార్కులు తారుమారయ్యాయని ఆరోపించారు. ఇంటర్ బోర్డు తీరుపై ఫైర్ అయ్యారు. మార్కుల జాబితాలో జరిగిన అక్రమాలపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

దీంతో స్పందించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదన్నారు. పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్‌గానే సాగిందన్నారు. ఎమైనా అనుమానాలుంటే రికౌంటింగ్‌కు వెళ్లండంటూ సమాధానమిచ్చారు. దీంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. టాపర్ అయిన తమ విద్యార్థులకు అతి తక్కువ మార్కులు వేశారంటూ మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంటర్ బోర్డు ఫలితాల విడుదల్లో అక్రమాలకు తెరదీసిందని ఆరోపిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.


First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...