చంద్రబాబు ఇంటికి అన్ని అనుమతులున్నాయి.. జగన్‌కు రమేష్ లేఖ

బాధ్యత గల పౌరుడిగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇల్లు ఇచ్చానని స్పష్టంచేశారు. ఇంటిని కూల్చివేస్తారని వస్తున్న వార్తలపై తాను మనోవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు.

news18-telugu
Updated: September 24, 2019, 10:36 PM IST
చంద్రబాబు ఇంటికి అన్ని అనుమతులున్నాయి.. జగన్‌కు రమేష్ లేఖ
కరకట్టపై చంద్రబాబు నివాసం
news18-telugu
Updated: September 24, 2019, 10:36 PM IST
విజయవాడ సమీపంలో ఉండవల్లి కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం ఏపీలో దుమారం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివసిస్తున్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఇంటి కూల్చివేతకు కూడా రంగం సిద్ధమైంది. సీఆర్డీఏ నోటీసులకు సమాధానం చెప్పేందుకు శుక్రవారం వరకు మాత్రమే డెడ్‌లైన్ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌కు పారిశ్రామికవేత్త రమేష్ లేఖ రాశారు. కరకట్టపై ఉన్న అతిధి గృహం కూల్చివేత నోటీసులపై 5పేజీలు లేఖ రాశారు. ఉండవల్లిలోని అతిధి గృహానికి 2012లో అప్పుడు ఉన్న చట్టపరమైన అన్ని అనుమతులను పొందామని స్పష్టంచేశారు. బాధ్యత గల పౌరుడిగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇల్లు ఇచ్చానని స్పష్టంచేశారు. ఇంటిని కూల్చివేస్తారని వస్తున్న వార్తలపై తాను మనోవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు.

ఉండవల్లిలోని అతిధి గృహానికి 2012లో అప్పుడు ఉన్న చట్టపరమైన అన్ని అనుమతులూ పొందాం. ఇరిగేషన్ శాఖలోని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుంచి ఎన్.ఓ.సి. కూడా తీసుకున్నాo. కూల్చివేతల ధోరణి వల్ల ప్రభావితమయ్యేది నా ఒక్క కుటుంబం మాత్రమే కాదు. సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అనేది రాజధాని ప్రాంతంలో లక్షల మందిని నిరాశానిస్పృహల్లోకి నెట్టివేస్తుంది. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఆలోచించుకోగలరు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం తపిస్తున్న తనలాంటి వ్యక్తులపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఏ మేరకు సబబు.
లింగమననేని రమేష్


లింగమనేని లేఖపై మంగళగిరి వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. లింగమనేని గెస్ట్‌ హౌస్‌కు ఒక్క అనుమతి కూడా లేదని.. దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టంచేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడిస్తానని స్పష్టంచేశారు.

First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...