ఎమర్జెన్సీకి 44 ఏళ్లు : ఆనాటి చీకటి రోజులపై ఆసక్తికర విషయాలు..

అంతర్గత కల్లోలాలతో దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్న కారణంతో ఇందిరా ఎమర్జెన్సీని ప్రకటించారు.నేటితో ఎమర్జెన్సీకి 44 ఏళ్లు పూర్తవడంతో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించారు.

news18-telugu
Updated: June 25, 2019, 12:45 PM IST
ఎమర్జెన్సీకి 44 ఏళ్లు : ఆనాటి చీకటి రోజులపై ఆసక్తికర విషయాలు..
ఇందిరా గాంధీ (File)
  • Share this:
స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన పీరియడ్‌ ఎమర్జెన్సీ.అందుకే ఎమర్జెన్సీని చాలామంది చీకటి రోజులుగా అభివర్ణిస్తారు. అంతర్గత కల్లోలాలతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో ఆనాడు ఇందిరా ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352ను ఆధారం చేసుకుని ఈ ఎమర్జెన్సీ ప్రకటించారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి 11.45గంటలకుదేశంలో ఎమర్జెన్సీని విధించగా... అప్పటినుంచి 1977, మార్చి 21 వరకు ఎమర్జెన్సీ కొనసాగింది.ఈ 21 నెలల కాలంలో ఇందిర తన ప్రత్యర్థులను చాలామందిని జైళ్లలో నిర్బంధించారు.పౌర హక్కులు అన్న పదానికి అసలు తావు లేకుండా పోయింది. పత్రికా స్వేచ్చను కూడా ఆమె నియంత్రించారు. ఇదే ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా కుమారుడు సంజయ్ గాంధీ మాస్-స్టెరిలైజేషన్(సామూహిక గర్భ నివారణ కార్యక్రమం) చేపట్టారు.

నిజానికి రాజ్యాంగం ప్రకారం కేబినెట్ ఆమోదంతోనే రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉండగా.. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కేబినెట్ సంప్రదింపులు లేకుండానే రాష్ట్రపతికి ఎమర్జెన్సీ సిఫారసులు పంపింది. అయితే మరుసటి రోజు తప్పనిసరి పరిస్థితుల్లో కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలపడంతో ఇందిరా నిర్ణయానికి మార్గం సుగమమైంది.


1969లో కాంగ్రెస్ చీలిక వచ్చాక 1971లో వచ్చిన ఎన్నికల్లో ఇందిరా సారథ్యంలోని కాంగ్రెస్ 352 సీట్లతో జయకేతనం ఎగరవేసింది.అయితే ఇందిరా గాంధీ అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని.. ఆమెపై ఓటమి పాలైన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. అప్పటికే దేశమంతా అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలు మొదలయ్యాయి.సోషలిస్ట్ జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి పిలుపుతో దేశ ప్రజలంతా శాంతియుత నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో అంతర్గత కల్లోలాలతో దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్న కారణంతో ఇందిరా ఎమర్జెన్సీని ప్రకటించారు.నేటితో ఎమర్జెన్సీకి 44 ఏళ్లు పూర్తవడంతో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించారు. ఆనాడు ధైర్యవంతంగా ఎమర్జెన్సీని ఎదుర్కొని నిలబడ్డవారందరికీ భారత్ సలాం చేస్తోందన్నారు. నియంత్రుత్వాన్ని ఎదుర్కొని భారత ప్రజాస్వామ్యం విజయవంతంగా నిలబడగలిగిందని స్పష్టం చేశారు.

First published: June 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు