గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం... ఫ్లైట్‌లో వైఎస్ విజయమ్మ

గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం... ఫ్లైట్‌లో వైఎస్ విజయమ్మ

హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఇండిగో విమానం ల్యాండింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

  • Share this:
    ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం లేకపోవడంతో ఓ విమానం గాల్లో చక్కర్లో కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో  భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఇండిగో విమానం ల్యాండింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విమానం దించేందుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పైలట్ గాల్లోనే విమానాన్ని చక్కర్లు కొట్టిస్తున్నాడు.

    అయితే ఈ విమానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఆమె బయల్దేరినట్లు సమాచారం. అయితే విమానం బయలుదేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ గన్నవరంకు చేరుకునే సమయానికి పూర్తిగా మారిపోయింది.  ఓ వైపు వర్షం మరోవైపు తీవ్ర గాలులు వీస్తుండటంతో .. విమానాన్ని క్షేమంగా దించేందుకు ఇండిగో పైలెట్లు ప్రయత్నిస్తున్నారు.
    First published: