Home /News /politics /

INDIAS INTERESTS COME FIRST SAYS NIRMALA SITHARAMAN ON BUYING OIL FROM RUSSIA PAH

Nirmala Sitharaman: భారత దేశ ప్రయోజనాలే మా తొలి ప్రయారిటీ.. అమెరికాకు నిర్మలా సీతారామన్ స్ట్రాంగ్ కౌంటర్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

Central Finance Minister: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు అంశాలపై కీలక అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. ఆమె సీఎన్ బీసీ- 18 అవార్డుల కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. వివిధ రంగాలలో.. పేరు పొందిన దిగ్గజాలతో వివిధ అంశాలపై చర్చించారు.

ఇంకా చదవండి ...
Indias Interests Come First: రష్యా నుంచి తమ దేశ ప్రయోజనాల కోసం మాస్కో నుంచి చమురు దిగుమతి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె.. భారత్ లోనే అతిపెద్ద దైన.. ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డు, సీఎన్ బీసీ- 18 అవార్డుల కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ మాట్లాడుతూ... భారత దేశ ఆర్థిక వ్యవస్థ తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. మాస్కో నుంచి ఢిల్లీకి చమురు బ్యారెళ్లు రావడానికి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.

ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలిరోజు.. ఈ ఏడాదంతా కూడా ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. తమదేశ అవసరాల కోసం రష్యాతో చమురు ఒప్పందం చేసుకున్నామని అన్నారు. తమ దేశ ప్రజలకు తక్కువ ధరలకు చమురు సరఫరా చేస్తుంటే ఎందుకు ఒప్పందం చేసుకొకుడదంటూ అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రయోజనాలకు తమ తొలి ప్రయారీటి అని స్పష్టం చేశారు. భారత్ ఇక మీదర శిలాజ ఇంధనంపై ఆధారపడటం తగ్గించాలని అన్నారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని దీని వాడకం తగ్గించాలన్నారు.

దీనికి ప్రత్యామ్నాయంలో పర్యావరణ హితమైన వాటిని ప్రొత్సహిస్తామని అన్నారు. దేశంలో ప్రస్తుతం.. రైతులను తాము అన్నివిధాలు ఆదుకుంటున్నామని తెలిపారు. ఎరువుల సబ్సీడీల వలన ఉత్పన్నమయ్యే ప్రభావాన్ని వారిపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రిప్టోకరెన్సీలపై ప్రవేశపెట్టిన చట్టాలను ప్రభుత్వం తన తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో ముందుకు తీసుకువెళుతుందా అని అడిగిన ప్రశ్నకు, కేంద్రం " చేసిన అన్ని హామీలను నెరవేరుస్తుందని నిర్మల అన్నారు.

ఈ అవార్టుల కార్యక్రమంలో.. నిర్మల సీతారామన్ CNBC TV18 యొక్క షెరీన్ భాన్‌తో టౌన్‌హాల్ చర్చించారు. అదే విధంగా ఆమె.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి ఉదయ్ కోటక్, నెస్లే సిఎండి సురేష్ నారాయణన్, ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పరేఖ్ మరియు బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్‌తో సహా ఇండియా ఇంక్ నాయకులతో కూడా ఆమె మాట్లాడారు. ఈ క్రమంలో.. ఉదయ్ కోటక్‌ ఆసక్తికరమైన ప్రశ్నను నిర్మలను అడిగారు. అదేంటంటే.. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం గురించి ఆమెకు తెలిసి ఉంటే ఏంచేసేవారని అడిగారు. దీనికి సీతారామన్ సమాధానమిస్తూ.. గోధుమలు ఎగుమతి అయ్యేలా చూసుకుంటానని, తినదగిన నూనె కోసం పొద్దుతిరుగుడును భారతదేశానికి దిగుమతి చేసుకునేవారమని, భారతీయ విద్యార్థులను సకాలంలో ఉక్రెయిన్ నుండి బయటకు రప్పించేవారమని సీతారామన్ అన్నారు.

IBLA 17వ ఎడిషన్ సీతారామన్ పాల్గొన్నారు. IBLA యొక్క ఈ సంవత్సరం థీమ్ లీడర్స్ ఆఫ్ ఛేంజ్, మహమ్మారితో మార్పు సమయంలో ఆదర్శప్రాయమైన నిబద్ధతను ప్రదర్శించిన వ్యాపార వ్యక్తులను గౌరవించడం. భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో కొందరిని 13 విభాగాలలో ఈ అవార్డులు అందించబడతాయి. వీటిలో.. యంగ్ టర్క్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, యంగ్ టర్క్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, మోస్ట్ ప్రామిసింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్, అవార్డ్ ఫర్ ది డిస్రప్టర్స్, అవార్డ్ ఫర్ బ్రాండ్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, హాల్ ఆఫ్ ఫేమ్, జ్ఞాపకార్థం ప్రదానం చేస్తారు.

స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఎంటర్‌టైన్‌మెంట్ లీడర్ ఆఫ్ ది ఇయర్, బ్రాండ్ ఇండియాకు అత్యుత్తమ సహకారం అందించినందుకు అవార్డు ను అందచేస్తారు. అత్యుత్తమ కంపెనీ ఆఫ్ ది ఇయర్ మరియు అత్యుత్తమ వ్యాపార నాయకుడిగా అవార్డు. 40కి పైగా కంపెనీలు, వ్యక్తులు మరియు సంస్థలలో అత్యుత్తమ నాయకులకు అవార్డులు ఇవ్వబడతాయి.
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Nirmala sitharaman

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు